జైలుకు ప్ర‌ముఖ‌ హీరోయిన్..

2 months ago 7
ARTICLE AD

ఇటీవ‌ల బాలీవుడ్ హాస్య‌న‌టుడు రాజ్‌పాల్ యాద‌వ్ చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. 9కోట్ల అప్పున‌కు సంబంధించిన వివాదం అత‌డిని జైలుకు పంపింది. అయితే అత‌డికి ష‌ర‌తుల‌తో కూడిన మ‌ధ్యంత‌ర  బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాత్కాలికంగా అత‌డు బ‌య‌ట తిర‌గొచ్చు. కానీ గ‌డువు లోపు కోర్టున‌కు అత‌డు స‌మాధానమిచ్చి, డ‌బ్బు తెచ్చి వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ కేసులో త‌ర‌హాలోనే ఇప్పుడు `బ‌ద్రి` హీరోయిన్ అమీషా ప‌టేల్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. దాదాపు 14.5 ల‌క్ష‌ల‌కు సంబంధించిన కేసు ఇది. మొరాదాబాద్ లోని ఓ ఈవెంట్ లో ప్ర‌ద‌ర్శ‌న కోసం అమీషాకు ఈవెంట్ మేనేజ‌ర్ ప‌వ‌న్ 14.5 ల‌క్ష‌ల అడ్వాన్స్ చెల్లించాడు. కానీ అమీషా ఆ ఈవెంట్ కి హాజ‌రు కాలేదు. దీంతో తిరిగి అత‌డికి 10ల‌క్ష‌లు  చెల్లించేసింది. కానీ మిగిలిన 4.5 ల‌క్ష‌లు చెల్లించ‌లేదంటూ అత‌డు కోర్టుకెక్కాడు. అమీషా ఇచ్చిన చెక్కు బౌన్స్ కావ‌డంతో బాధితుడు కోర్టునాశ్ర‌యించాడు. అయితే ఈ కేసులో ప‌దే ప‌దే హాజ‌రు లేకుండా డుమ్మా కొట్టిన అమీషాకు కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ ని జారీ చేసి లొంగిపోవాల్సిందిగా ఆర్డ‌ర్ వేసింది. మార్చి 27న కోర్టుకు హాజ‌రై స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని కోర్టు ఆర్డ‌ర్ జారీ చేసింది.  

రాజ్ పాల్ యాద‌వ్ 9కోట్ల అప్పు కేసులో అరెస్ట్ త‌ర్వాత ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఈ న‌టికి ఎదురైంది. అయితే ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం అంటూ అమీషా ప‌టేల్ ఖండించింది. ఇది పాత కేసు.. 2017 నుంచి కొన‌సాగుతోంది. అత‌డి అప్పు చెల్లించేసాను. ప‌బ్లిసిటీ కోసం అత‌డు డ్రామా ఆడుతున్నాడ‌ని అమీషా సీరియ‌స్ అయ్యారు. అత‌డిపై త‌న లాయ‌ర్ చీటింగ్ కేసు పెడ‌తార‌ని కూడా హెచ్చ‌రించింది.

Read Entire Article