జీరో నుంచి హీరోగా ఎదిగిన గాయ‌కుడు

1 month ago 5
ARTICLE AD

చాలా మంది సెల‌బ్రిటీల జీవితాలు సిల్వ‌ర్ స్పూన్ తో ప్రారంభ‌మైన‌వి కావు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి తుది కంటా పోరాటం సాగించిన త‌ర్వాతే అంద‌మైన జీవితం సాధ్య‌ప‌డుతుంది. అలాంటి ఒక సాధార‌ణ యువ‌కుడు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ గా చేరాడు. మొద‌ట అమీర్ ఖాన్ సినిమాలో ఒక పాట‌లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ గా క‌నిపించాడు. అత‌డికి డ్యాన్స‌ర్ గా కొన‌సాగినందుకు రోజుకు రూ.300 అందుకునేవాడు. ఆ త‌ర‌వాత అత‌డు గాయ‌కుడిగా మారాడు. అంచ‌లంచెలుగా ఎదిగాడు. అత‌డు స‌హ‌జంగా ర్యాప‌ర్ గా గ‌ర్తింపు తెచ్చుకున్నాడు. ఒక‌ప్పుడు గుంపులో గోవిందంలా ఎవ‌రికీ క‌నిపించ‌ని అత‌డు పాపుల‌ర్ గాయ‌కుడిగా మారి నేటిత‌రాన్ని ఉర్రూత‌లూగిస్తున్నాడు.

ఆస్తుల్లో టాప్ 5 గాయ‌కులు షాన్ పేరు కూడా సుస్థిరమైంది. తాజా లెక్క‌ల ప్ర‌కారం... షాన్ 157 కోట్ల ఆస్తుల‌తో చార్ట్ లో టాప్ లో ఉన్నాడు. అత‌డు ఒక్కో పాట కోసం 2 నుంచి 3 ల‌క్ష‌లు అందుకుంటున్నాడు. స్టేజీ షోల కోసం ఏకంగా 22 ల‌క్ష‌ల నుంచి 30ల‌క్ష‌ల వ‌ర‌కూ అందుకుంటున్నాడు. అత‌డికి ముంబై బాంద్రాలో అత్యంత విలాస‌వంత‌మైన భ‌వంతి ఉంది. 

ఇటీవ‌ల పూణేలో కొనుగోలు చేసిన ఆస్తి విలువ 10 కోట్లు. అతడు విలాస‌వంత‌మైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కార్ ని ఉప‌యోగిస్తున్నాడు. దీని ఖ‌రీదు సుమారు 2.6 కోట్లు. అత్యంత సంక్లిష్ఠ‌మైన భావ‌జాలం ప‌ని చేసే ఇండ‌స్ట్రీలో షాన్ స్వ‌యంకృషితో ఈ స్థాయికి ఎదిగాడు. అందుకే అతడు ఎంద‌రికో స్ఫూర్తి.

Read Entire Article