జాన‌ప‌ద క‌ళాకారిణి పాత్ర‌లో శ్ర‌ద్ధా

3 weeks ago 4
ARTICLE AD

మ‌న‌కు చాలా వ‌ర‌కూ సుర‌భి క‌ళాకారుల గురించి తెలుసు. వారి జీవితాల‌లో క‌ష్టాల గురించి బ‌తుకు పోరాటం గురించి తెలుసు. ఇంచుమించు అదే జీవితం మ‌రాఠా నాట‌క రంగంలోను ఎదుర్కొన్న క‌ళాకారిణులు ఉన్నారు. అలాంటి వారిలో అత్యంత సాహ‌సోపేత‌మైన క‌ళాకారిణిగా గుర్తింపు పొందిన వీఠా భాయి పై ప్ర‌స్తుతం బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

స్టేజీపై ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుండ‌గా వీఠాభాయి కి పురుటి నొప్పులు మొద‌ల‌య్యాయి. ఆ స‌మ‌యంలో వేదిక వెన‌క్కి వెళ్లిన‌ప్పుడు ఆ రోజుల్లో స‌రైన డాక్ట‌ర్లు కానీ శ‌స్త్ర చికిత్స వ‌స్తువులు కానీ అందుబాటులో లేవు. బొడ్డు పేగును అక్క‌డ అందుబాటులో ఉన్న ఒక రాతితో కోసారు. బిడ్డ‌ను వ‌దిలి వేదిక‌పైకి వ‌చ్చి పెండింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసారు వీటా భాయ్.. క‌ళ కోసం జీవితాన్ని ప్రాణాల‌ను అంకిత‌మిచ్చేందుకు సిద్ధ ప‌డిన మేటి జాన‌ప‌ద క‌ళాకారిణిగా నాటి నుంచి గుర్తింపు పొందారు. ఇండియా చైనా వార్ స‌మ‌యంలో భార‌త సైనికుల‌కు వినోదాన్ని పంచిన జాన‌ప‌ద క‌ళాకారిణిగాను వీఠా సాహ‌సాల‌ను ప్ర‌శంసిస్తారు.

ప్ర‌స్తుతం `వీటా పేరుతో బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. టైటిల్ పాత్ర‌లో సాహో ఫేం శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ప్రముఖ మరాఠీ దర్శకుడు సంజయ్ జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. లోక్ మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుర‌భి క‌ళాకారుల కంటే భిన్న‌మైన శైలితో మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల్ని అల‌రించిన వీఠాభాయి జీవిత చ‌రిత్ర‌ను వెండితెర‌పై తెలుసుకోవాల‌ని ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Entire Article