<p><strong>Telangana High Court Rejects Mohan Babu Bail Petition: </strong>సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్దకు వెళ్లి జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టేసింది.</p>