జపాన్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

2 weeks ago 2
ARTICLE AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతము రాజా సాబ్ షూటింగ్ ని ఫినిష్ చేసి హను రాఘవపూడి దర్శకత్వంలో పౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న పౌజీ షూటింగ్ తో పాటుగా ప్రభాస్ ఈ నెల చివరిలో మొదలు కాబోయే సందీప్ వంగ స్పిరిట్ లుక్ లోకి చేంజ్ అవుతున్నారు. ఇప్పటికే స్పిరిట్ లుక్ టెస్ట్ లో కూడా ప్రభాస్ పాల్గొన్నారనే న్యూస్ వినబడుతుంది. 

ఇక ఇదే సమయంలో స్పిరిట్ షూటింగ్ మొదలవ్వబోయే ముందు ప్రభాస్ జపాన్ వెళ్లనున్నారని తెలుస్తుంది. అది కూడా పౌజీ షూటింగ్  నుంచి బ్రేక్ తీసుకుని మ‌రీ జ‌పాన్ వెళ్లాల‌నుకుంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ నటించిన కల్కి జపాన్ లో కూడా రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో ప్రభాస్ కాలి నొప్పి కారణంగా జపాన్ వెళ్లలేకపోయారు. 

అయినప్పటికీ జపాన్ మూవీ లవర్స్ కల్కి రిలీజ్ అనంత‌రం ఆ సినిమాను మాత్రం గ్రాండ్ స‌క్సెస్ చేసారు. అప్పుడు ప్రభాస్ ఖచ్చితంగా జపాన్ వస్తాను, మిమ్మల్ని కలుస్తాను అని ఓ వీడియో ద్వారా వారికి మాటిచ్చారు. ఈ నేప‌థ్యంలో వారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు ప్రభాస్ జ‌పాన్ వెళ్ల‌నున్నారు. 

Read Entire Article