అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణపై ITBP డీజీ శత్రుజీత్ కపూర్ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు కూడా భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణ కొనసాగుతుందని అన్నారు. డీజీ చేసిన ప్రకటన తర్వాత కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత ఉన్నప్పటికీ చైనాపట్ల ఈ సడలింపు, ఆర్థిక రంగంలో ఆధారపడటం చివరికి ఎలాంటి జాతీయవాదం అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రశ్నల దాడి

జైరాం రమేశ్ ITBP డీజీ ప్రకటనను పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారు. ఒకవైపు చైనా ముందు మోకరిల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి నిరంతరం రాయితీలు ఇచ్చే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ITBP డైరెక్టర్ జనరల్ అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా PLAతో భారత సరిహద్దు లోపల జరిగిన తాజా ఘర్షణల్లో ITBP ప్రదర్శనను ప్రశంసించారు. కానీ ప్రధానమంత్రి, ఆయన మొత్తం వ్యవస్థ ఈ తీవ్రమైన అంశంపై మౌనం వహిస్తోంది.

जहां एक तरफ़ चीन के सामने घुटने टेकने वाले प्रधानमंत्री की ओर से लगातार रियायतें देने का सिलसिला जारी है, इसी बीच ITBP के महानिदेशक ने अरुणाचल प्रदेश में चीनी PLA के साथ भारतीय सीमा के भीतर हालिया टकरावों में ITBP के प्रदर्शन की सराहना की है, जो बिल्कुल सही भी है। लेकिन प्रधानमंत्री और उनका पूरा तंत्र इस गंभीर मुद्दे पर चुप्पी साधे बैठा है। ताकसिंग में टकराव के बाद पिछले महीने अरुणाचल प्रदेश के वाचा और दमाई में कोर कमांडर स्तर की बातचीत हुई। स्थानीय लोगों ने बताया है कि लद्दाख की तरह एक बार फिर गश्त के कुछ बिंदु हमारे हाथ से निकल गए हैं। चीन अरुणाचल प्रदेश के हमारे शहरों के नाम बदलता जा रहा है और 60,000 मेगावाट का एक बाँध बना रहा है, जो हमारी पारिस्थितिकी और जल सुरक्षा के लिए बड़ा ख़तरा है। चीन के साथ भारत का व्यापार घाटा 2025-26 में रिकॉर्ड 112 अरब डॉलर तक पहुँच गया, जो पिछले साल 99 अरब डॉलर था। इससे कई उद्योगों में हमारे MSME बुरी तरह तबाह हुए हैं। ‘मेक इन इंडिया’ अब ‘इम्पोर्ट फ्रॉम चाइना’ बन गया है। इतना बड़ा व्यापार घाटा हमारी आर्थिक सुरक्षा के लिए भी एक गंभीर चुनौती है। भारत आज भी 19 जून 2020 को चीन को दी गई प्रधानमंत्री की उस कुख्यात क्लीन चिट की कीमत चुका रहा है। हमारे 20 बहादुर जवानों की शहादत के बाद प्रधानमंत्री ने कहा था: “ना कोई वहाँ हमारी सीमा में घुस आया है और न ही कोई घुसा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्ज़े में है।” पूर्व सेना प्रमुख जनरल नरवणे ने खुलासा किया था है कि लद्दाख में चीनी घुसपैठ के दौरान उन्हें केवल यही निर्देश मिला था: “जो उचित समझो वो करो।” 4 जुलाई 2025 को उप सेना प्रमुख लेफ्टिनेंट जनरल राहुल सिंह ने सार्वजनिक रूप से बताया था कि ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान के सैन्य अभियान में चीन की भूमिका कितनी व्यापक और गहराई तक फैली हुई थी। लेकिन 25 अगस्त 2026 को पूर्व चीफ ऑफ डिफेंस स्टाफ जनरल अनिल चौहान ने सार्वजनिक रूप से लेफ्टिनेंट जनरल राहुल सिंह के खुलासों का खंडन किया और उसके कुछ ही समय बाद RSS/BJP के इकोसिस्टम के एक प्रमुख थिंक टैंक की कमान संभाल ली। देश सवाल पूछ रहा है: सीमा पर जारी तनाव के बावजूद चीन के प्रति यह नरमी और आर्थिक मोर्चे पर बढ़ती निर्भरता आखिर किस तरह का राष्ट्रवाद है? देश को 56 इंच की छाती के खोखले दावे नहीं, राष्ट्रीय सुरक्षा पर स्पष्ट जवाब चाहिए।

— Jairam Ramesh (@Jairam_Ramesh) October 23, 2026

తాక్సింగ్‌లో ఘర్షణ తర్వాత గత నెల అరుణాచల్ ప్రదేశ్‌లోని వాచా, దమాయిలో కోర్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి. స్థానికులు తెలిపిన ప్రకారం లద్దాఖ్‌లాగే మరోసారి గస్తీకి సంబంధించిన కొన్ని పాయింట్లు మన నుంచి చేజారాయి. చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని మన పట్టణాల పేర్లను మార్చేయడంతో పాటు 60,000 మెగావాట్ల ఒక ఆనకట్టను నిర్మిస్తోంది. ఇది పర్యావరణం, జల భద్రతకు భారీ ముప్పుగా చెప్పవచ్చు.

ఇంపోర్ట్ ఫ్రం చైనాగా మారిన 'మేక్ ఇన్ ఇండియా'

చైనాతో భారత్ వాణిజ్య లోటు 2025-26లో రికార్డు స్థాయిలో 112 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది అది 99 బిలియన్ డాలర్లు. దీని వల్ల అనేక పరిశ్రమల్లో మన MSMEలు తీవ్రంగా నష్టపోయాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ ఇప్పుడు ‘ఇంపోర్ట్ ఫ్రం చైనా’గా మారిందని ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద వాణిజ్య లోటు భారత ఆర్థిక భద్రతకు కూడా తీవ్రమైన సవాలు.

భారత్ ఇప్పటికీ 19 జూన్ 2020న జరిగిన ఘటనలో చైనాకు క్లీన్ చిట్ ఇచ్చింది. 20 మంది భారత జవాన్లు అమరులైన తర్వాత.. అక్కడ మన సరిహద్దులోకి ఎవరూ చొరబడలేదు. మన ఏ పోస్టు కూడా మరొకరి ఆధీనంలో లేదని ప్రధాని మోదీ అన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే వెల్లడించిన ప్రకారం, లద్దాఖ్‌లో చైనా చొరబాటు సమయంలో తనకు ఒక్కటే ఆదేశం వచ్చిందని, సరైనదని అనిపించేది చేయమని చెప్పారని వెల్లడించారు.

దేశం మొత్తం ప్రశ్నిస్తోంది
4 జూలై 2025న ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ బహిరంగంగా ఓ విషయాన్ని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైనిక చర్యలో చైనా పాత్ర ఎంత లోతుగా విస్తరించి ఉందో చెప్పారు. కానీ 25 ఆగస్టు 2026న మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చేసిన ప్రకటనను బహిరంగంగా ఖండించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే RSS/BJP ఎకోసిస్టమ్‌లోని ఒక ప్రముఖ థింక్ ట్యాంక్ బాధ్యతలు స్వీకరించారు. దేశం ఈ విషయాన్ని ప్రశ్నిస్తోంది.. సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత ఉన్నప్పటికీ చైనాపట్ల ఈ సడలింపులు, ఆర్థిక రంగంలో ఆధారపడటం పెరుగుతుండటం చివరికి ఎలాంటి జాతీయవాదం? దేశానికి అండగా 56 అంగుళాల ఛాతీ అనే మాటలు చెప్పడం కాదు. జాతీయ భద్రతపై స్పష్టమైన సమాధానాలు కావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.