చాణక్య నీతి: మీ స్నేహితుడు నిజమైనవాడేనా? ఈ 5 పరీక్షలతో తెలుసుకోండి!

1 week ago 2
ARTICLE AD

చాణక్య నీతి:  నిజమైన స్నేహితుడు సంతోషంలో కాదు , సంక్షోభాలు, వివాదాలు , ఆర్థిక ఇబ్బందుల వంటి కష్ట సమయాల్లోనే తెలుస్తాడని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు. అయితే మీచుట్టూ ఉండేవారు, మీరు స్నేహితులు అనుకుంటున్నవారు నిజంగా నిజమైన స్నేహితులేనా కాదా?
మీ జీవితంలోకి అకస్మాత్తుగా ఒక పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు, నిజమైన స్నేహితుని అసలు పరీక్ష ఎదురవుతుంది. ఆచార్య చాణక్యుడు తన నీతిలో స్పష్టంగా చెప్పినట్లుగా, నిజమైన స్నేహితుడు సంతోషంలో కాదు, దుఃఖంలో , కష్ట సమయాల్లోనే మీతో ఉంటారు. చాణక్య నీతి ప్రకారం, నిజమైన స్నేహితుడిని గుర్తించడానికి సహాయపడే ఐదు పరిస్థితులను తెలుసుకుందాం.

చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!

సంక్షోభ సమయాల్లో , కష్ట సమయాల్లో వదిలిపెట్టవద్దు

జీవితంలో సంక్షోభాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా వస్తాయి. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టం లేదా కుటుంబ విషాదం ఒక వ్యక్తిని పూర్తిగా కుంగదీయగలవు. అలాంటి సమయాల్లో, చాలామంది క్రమంగా దూరమవుతారు. మీ సమస్యలను విని పారిపోకుండా, వాటికి పరిష్కారం కనుగొనడంలో సహాయపడే స్నేహితుడిని మీరు విశ్వసించాలని చాణక్య నీతి చెబుతుంది. సంక్షోభ సమయాల్లో మీకు అండగా నిలబడి, సరైన మార్గదర్శకత్వం మరియు మద్దతును అందిస్తారు.

చెడుల మధ్య తేడాను నేర్పిస్తారు

మీరేం చేసినా సమర్ధించేవారు నిజమైన స్నేహితులు ఎప్పటికీ కాలేరు. మంచి చెడు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి మీకు అర్థమయ్యేలా చెప్పి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించేవారే నిజమైన స్నేహితులు అవుతారు

చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!

సంఘర్షణ లేదా శత్రు సంక్షోభ సమయాల్లో రక్షణ కవచంగా నిలవడం

చాణక్య నీతి ప్రకారం, మీరు ఒక పెద్ద వాదనను లేదా ప్రత్యర్థిని ఎదుర్కొన్నప్పుడు స్నేహితుల నిజ స్వరూపం బయటపడుతుంది. ఆ క్షణం అక్కడి పరిస్థితుల నుంచి మీ నుంచి తప్పుకుని పారిపోయేవారిని ఎప్పటికీ విశ్వశించకండి. తన శక్తికి మించి మీకు రక్షణ కవచంలా నిలిచేవారే మీ స్నేహితుడు.

న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నప్పుడు వెనుతిరగవద్దు

చాణక్యుడు నీతిశాశ్త్రంలో ఓ శ్లోకంలో 'రజద్వార' గురించి ప్రస్తావించారు. దీనిని  న్యాయపరమైన లేదా కోర్టు కేసులను సూచించడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి పరిస్థితులలో, ప్రజలు తరచుగా ఇబ్బందులను తప్పించుకోవడానికి పారిపోతారు. కానీ న్యాయపరమైన చిక్కుల్లో మీకు మంచి సలహా ఇచ్చి, మీలో మనోధైర్యాన్ని నింపే స్నేహితుడే నిజమైన స్నేహితుడు.

ఆర్థిక ఇబ్బందుల సమయంలో స్నేహితుని ప్రవర్తన మారనప్పుడు

డబ్బు అనేది సంబంధం నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. మీ జేబులు నిండుగా ఉన్నప్పుడు, ప్రపంచమంతా మీ పక్షాన ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు, పరిచయస్తులు తరచుగా దూరం కావడం ప్రారంభిస్తారు. చాణక్యుని ప్రకారం, నిజమైన స్నేహితుడు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తన ప్రవర్తనను ఎప్పుడూ మార్చుకోడు. అతను ఎలాంటి స్వార్థపూరిత ఉద్దేశ్యాలు లేకుండా, తన శక్తి మేరకు మీకు అండగా నిలుస్తాడు.

వివాహం, బంధాలు, రాజనీతి, విద్య సంపద ప్రాముఖ్యత, స్నేహాలు సహా జీవితంలో ఉన్నతి కోసం వివిధ అంశాలపై చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలు గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి...

Read Entire Article