చాణక్య నీతి: అక్రమ సంబంధం పెట్టుకున్నవారికి చాణక్యనీతిలో శిక్షలివే!
3 months ago 9
ARTICLE AD
Chanakya Niti in telugu: ఆచార్య చాణక్యుడు తన రచనల్లో... వివాహవ్యవస్థ, కుటుంబ బంధాలు, అక్రమ సంబంధాల గురించి కూడా తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారు.  నైతిక సూత్రాలు, మానవ స్వభావం, సంబంధాల గురించి వివరించిన చాణక్యుడు అందులో స్త్రీల స్వభావం, కామం,  విశ్వాసానికి సంబంధించి శ్లోకాలున్నాయి. ఇవి అక్రమ సంబంధాలకు హెచ్చరికలుగా చూడొచ్చు. అర్థశాస్త్రంలో మాత్రం రాజ్య వ్యవస్థలో అక్రమ సంబంధాలకు సంబంధించి చట్టాలు, శిక్షల గురించి వివరణ ఉంది.
సమాజంలో నైతికత, విశ్వాసం, కుటుంబ వ్యవస్థ కాపాడేందుకు అక్రమ సంబంధాలను తీవ్రంగా వ్యతిరేకించారు చాణక్యుడు. స్త్రీలు - పురుషుల స్వభావం గురించి ఆయన శ్లోకాల్లో...
స్త్రీలకు పురుషులకన్నా ఎక్కువ కామం ఉంటుందని, వారిని విశ్వశించకూడదని హెచ్చరికలున్నాయి.
దుష్ట భార్య ఉండడం మరణానికి సమానం అని వివరించారు
అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీలు త్వరగా నాశనం అవుతారని చెప్పారు
స్త్రీ రూపానికి మూలం పాతివ్రత్యమే అన్నారు చాణక్యుడు
అక్రమ సంబంధాలు కుటుంబాన్ని , సమాజాన్ని నాశనం చేస్తాయని.. భార్యా భర్తల మధ్య విశ్వాసం, సంతృప్తి ముఖ్యమని ఆయన నీతి సూత్రాలు సూచిస్తాయి.
అక్రమ సంబంధాలు పెట్టుకునే స్త్రీలకు పురుషులకు ఎలాంటి శిక్షలు?
చాణక్యుడి అర్థశాస్త్రంలో అక్రమ సంబంధాలు నడిపేవారికి కఠిన శిక్షలు సూచించారు. ఇవి రాజ్య చట్టాలుగా ఉద్దేశించారు
విద్యార్థి గురుపత్రిని అక్రమ సంబంధం   -  పురుషాంగం ఖండించి, ప్రాణం తీయడమే శిక్ష
సన్యాసినులతో అక్రమ సంబంధం   -  ఆ వ్యక్తికి 24 ఫణములు అపరాధ రుసుము, సన్యాసినికి కూడా అపరాధ రుసుము తప్పదు
రాజు భార్యతో అక్రమ సంబంధం- మరుగుతున్న నీళ్లలో వేసి పురుషుడిని చంపడం
బానిసతో స్త్రీ అక్రమ సంబంధం - స్త్రీని ఉరితీయడం
నిషిద్ధ బంధువుతో అక్రమ సంబంధం ( తండ్రి సోదరి, తల్లి సోదరి, మేనమామ భార్య, కోడలు, కుమార్తె, సోదరి) - పురుషాంగం ఖండించి చంపడం
అక్రమ సంబంధానికి సహకరించిన స్త్రీకి ఉరిశిక్ష
ఇవి చాణక్యుడి కాలంలో కఠిన చట్టాలు.
అక్రమ సంబంధాలు, స్త్రీ, నైతికతకు సంబంధించిన కొన్ని ముఖ్య శ్లోకాలు ఇక్కడున్నాయి
దుష్టా భార్యా శఠం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః ।
ససర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయః  ॥
దుష్ట భార్య, మోసగాడైన మిత్రుడు, జవాబు ఇచ్చే భృత్యుడు, పాములున్న ఇంట్లో నివాసం ...ఇవి మరణానికి సమానం
విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ  ॥
నదులు, ఆయుధాలు పట్టుకున్నవారు, గోళ్లున్న జంతువులు, కొమ్ములున్నవి, స్త్రీలు, రాజకుటుంబాలను విశ్వశించకూడదు
స్త్రీణాం ద్విగుణ ఆహారో లజ్జా చాపి చతుర్గుణా ।
సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణః స్మృతః  ॥
స్త్రీలకు ఆహారం రెండింతలు, లజ్జ నాలుగింతలు, సాహసం ఆరింతలు, కామం ఎనిమిదింతలు ఉంటాయి
అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతిలోభితా ।
అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషాః స్వభావజాః  ॥
అబద్ధం, సాహసం, మాయ, మూర్ఖత్వం, అతిలోభం, అశుచి, నిర్ధయత్వం - ఇవి స్త్రీల స్వాభావిక దోషాలు
నదీతీరే చ యే వృక్షాః పరగేహేషు కామినీ ।
మంత్రహీనాశ్చ రాజానః శీఘ్రం నశ్యంత్యసంశయం  ॥
నదీతీరంపై చెట్లు, పర గృహాల్లో స్త్రీలు, మంత్రులు లేని రాజులు త్వరగా నాశనమవుతారు
కోకిలానాం స్వరో రూపం స్త్రీణాం రూపం పతివ్రతమ్ ।
విద్యా రూపం కురూపాణాం క్షమా రూపం తపస్వినాం  ॥
కోకిలకు స్వరం రూపం, స్త్రీకి పతివ్రత రూపం, విద్యలేనివారికి విద్య రూపం, తపస్వులకు క్షమ రూపం
మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితమ్ ।
దాంపత్యే కలహో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతా  ॥
మూర్ఖులు పూజలందుకునే చోట , ధాన్య సమృద్ధిగా ఉండే చోట, భార్య భర్తల మధ్య గొడవలు లేనిచోట సంపద ఉంటుంది
ఈ శ్లోకాలు అక్రమ సంబంధాలకు వ్యతిరేకంగా నైతిక హెచ్చరికలుగా ఉపయోగపడతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం
Read Entire Article