Hero Xtreme 160R 4V vs Rivals Comparison: 160సీసీ స్పోర్ట్స్ బైక్‌ సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే TVS Apache RTR 160 4V, Bajaj Pulsar N160 వంటి బలమైన మోడళ్లతో మార్కెట్‌ ఫుల్‌ అయిపోయింది. ఇప్పుడు Hero Xtreme 160R 4V తాజా అప్‌డేట్‌తో (క్రూయిజ్‌ కంట్రోల్, రైడ్ బై వైర్, 3 రైడింగ్ మోడ్స్‌) బరిలోకి దిగడంతో కాంపిటిషన్ మరింత ఆసక్తికరంగా మారింది. మూడు బైక్‌లను పోల్చితే ఏది బెస్ట్‌ అనేది ఈ కథలో వివరంగా తెలుసుకుందాం.

ఇంజిన్‌, పవర్ ఔట్‌పుట్ - ఏది స్ట్రాంగ్?

ఈ మూడు బైక్‌లూ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌లతో వస్తాయి. Pulsar N160కి పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ ఉన్నా, అది మూడింటిలో తక్కువ పవర్ ఇస్తోంది.

TVS Apache RTR 160 4V మాత్రం డిస్‌ప్లేస్‌మెంట్ తక్కువ ఉన్నా అత్యధిక పవర్ & టార్క్ ఇస్తూ లీడ్‌లో నిలుస్తోంది.

Hero Xtreme 160R 4V 4-వాల్వ్ సెటప్, రైడ్ బై వైర్‌తో రెస్పాన్స్ బెటర్‌గా ఇచ్చేలా ట్యూన్ చేశారు.

Apache – హైయ్యెస్ట్ పవర్

Xtreme – స్మూత్ రెస్పాన్స్

Pulsar – క్యాజువల్ రైడర్లకు సరిపోయే పవర్

బరువు & పరిమాణాలు – రోడ్డుపై ఏది లైట్‌ ఫీల్ ఇస్తుంది?

Apache RTR 160 4V ఈ మూడింటిలో అతి తక్కువ బరువు గల బైక్‌. అందుకే కమ్యూటింగ్‌లో, ట్రాఫిక్‌లో చాలా లైట్‌గా, రెస్పాన్సివ్‌గా ఫీలవుతారు.

Hero Xtreme 160R 4V కూడా దాని కంటే కేవలం 1.5kg ఎక్కువే. అంటే ఫ్లెక్సిబిలిటీ అలానే ఉంటుంది.

Pulsar N160 మాత్రం మూడు బైక్‌లలో అతి హెవీ, అయితే పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల రేంజ్ ఎక్కువ ఉంటుంది.

Apache గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180mm. బ్రేకర్లపై టెన్షన్ లేకుండా నడపడానికి బెస్ట్.

సస్పెన్షన్‌, బ్రేకులు, టైర్లు – ఏ బండి స్ట్రాంగ్?

Hero Xtreme 160R 4V బేస్ వెర్షన్‌ నుంచే USD ఫోర్క్స్ ఇస్తుంది. ఇది పెద్ద ప్లస్ పాయింట్.

Pulsar & Apache మాత్రం టాప్ వేరియంట్‌లలోనే USD ఫోర్క్స్ ఇస్తాయి.

Apacheలో వేరియంట్‌ ప్రకారం రియర్ బ్రేకులు, వీల్ సైజులు మారుతాయి.

అన్ని టాప్ వేరియంట్లలో 130 సెక్షన్ టైర్ వస్తుంది, ఇది మీద స్టెబిలిటీ బెటర్.

ఫీచర్లు – ఏ బండిలో జిమ్మిక్స్ ఎక్కువ?

Hero Xtreme 160R 4V

రైడ్‌ బై వైర్‌
క్రూయిజ్‌ కంట్రోల్‌ (ఈ సెగ్మెంట్‌లో ఇది ఒక్కటే)
3 రైడింగ్‌ మోడ్స్‌ – రెయిన్‌, రోడ్‌, స్పోర్ట్‌
LED హెడ్‌లైట్
కలర్ LCD డిస్‌ప్లే

Apache RTR 160 4V

5-ఇంచుల TFT స్క్రీన్
ట్రాక్షన్‌ కంట్రోల్‌
స్లిప్‌ & అసిస్ట్‌ క్లచ్‌
GTT టెక్నాలజీ
అడ్జస్ట్‌ చేసుకోదగిన లీవర్స్‌
ప్రొజెక్టర్‌ LED హెడ్‌లైట్

Pulsar N160

డిజిటల్‌ డిస్‌ప్లే
3 ABS మోడ్స్‌
USD ఫోర్క్స్‌ (టాప్ వెర్షన్‌లో మాత్రమే)

లక్షణాల పరంగా... Apache RTR 160 4V మార్కెట్‌లో ఫీచర్‌ రిచ్ ప్యాకేజీ. Xtreme మాత్రం క్రూయిజ్ కంట్రోల్‌తో స్పెషల్ స్టాండ్ అవుతుంది.

ధర – ఏది 'వ్యాల్యూ ఫర్ మనీ'?

Apache RTR 160 4V – ( చీపెస్ట్ కూడా, కాస్ట్‌లీ వెర్షన్ కూడా) – వేరియంట్‌పై ఆధారపడి.

టాప్ వేరియంట్‌లలో Xtreme & Apache మధ్య కేవలం ₹2,000 తేడా మాత్రమే.

Pulsar N160 మాత్రం సింపుల్ ఇంజిన్‌, తక్కువ ఫీచర్లతో ₹10,000 చీపర్.

ఫైనల్‌గా...

పెర్ఫార్మెన్స్ + ఫీచర్లు కావాలంటే - Apache RTR 160 4V బెస్ట్

క్రూయిజ్ కంట్రోల్ + మోడరన్ రెస్పాన్స్ కావాలంటే - Hero Xtreme 160R 4V

సింపుల్, స్టేబుల్, బడ్జెట్ ఎంపిక - Pulsar N160

మెదటి చూపులో Apache స్ట్రాంగ్ కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తున్నా, రియల్-వరల్డ్ టెస్టింగ్ తర్వాతే ఫుల్ క్లారిటీ వస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.