Hero Xpulse 210 New GST Price: హీరో మోటోకార్ప్‌, తన కొత్త Xpulse 210 బైక్‌ ధరలను తగ్గించి యువ రైడర్లకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇటీవల, కేంద్ర ప్రభుత్వం, టూవీలర్లపై (350cc లోపు) GST రేటు తగ్గించడంతో, ఈ అడ్వెంచర్‌ బైక్‌ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. GST 2.0 కు ముందు, Hero Xpulse 210 బేస్‌ వేరియంట్‌ ₹1.76 లక్షలు కాగా, టాప్‌ వేరియంట్‌ ₹1.86 లక్షలుగా ఉండేది. ఇప్పుడు, బేస్‌ వేరియంట్‌ రేటు ₹1.62 లక్షలు & టాప్‌ వేరియంట్‌ రేటు ₹1.71 లక్షలకు తగ్గాయి, ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. అంటే, ఒక్కో వేరియంట్‌ మీద సుమారు ₹15,000 చొప్పున డిస్కౌంట్‌ వచ్చినట్టే.

శక్తిమంతమైన ఇంజిన్‌ & పనితీరు
Hero Xpulse 210లో Karizma XMR నుంచి వచ్చిన 210cc లిక్విడ్‌ కూల్డ్‌ DOHC ఇంజిన్‌ ఉంది. ఇది 24.2 bhp పవర్‌, 20.7 Nm టార్క్‌ ఇస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ & స్లిపర్‌ క్లచ్‌ ఉండటంతో గేర్‌ షిఫ్టింగ్‌ మరింత స్మూత్‌గా ఉంటుంది.

నిర్మాణం & కంఫర్ట్‌
Xpulse 210 బైక్‌ను స్టీల్‌ సెమీ డబుల్‌ క్రాడిల్‌ ఫ్రేమ్‌పై నిర్మించారు. ముందు టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, వెనుక లింక్డ్‌ మోనోషాక్‌ సస్పెన్షన్‌ సిస్టమ్‌ ఉన్నాయి. రెండు చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌లు ఉన్నాయి, టు-చానల్‌ ABS తో వేగంలోనూ భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ABS లో మూడు మోడ్స్‌ - రోడ్‌, ఆఫ్‌ రోడ్‌, ర్యాలీ - అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్లు & టెక్నాలజీ
Hero Xpulse 210 లో TFT స్క్రీన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఫుల్‌ LED లైటింగ్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఈ బైక్‌ను టెక్నాలజీ పరంగా మోర్‌ ప్రీమియం బైక్‌గా చూపిస్తున్నాయి.

డిజైన్‌ & డైమెన్షన్స్‌
బైక్‌ కెర్బ్‌ వెయిట్‌ 168 కిలోలు. 13 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌, 220 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కలిగి ఉన్నాయి. ఫ్రంట్‌ సస్పెన్షన్‌ ట్రావెల్‌ 210 mm, రియర్‌ 205 mm. సీటు ఎత్తు 830 mm, కాబట్టి కాస్త ఎత్తు తక్కువ రైడర్లకూ సౌకర్యంగా ఉంటుంది.

పోటీ బైక్‌లు
Xpulse 210కి ప్రధాన ప్రత్యర్థి Kawasaki KLX 230. అయితే టెక్నాలజీ పరంగా, ఫీచర్ల పరంగా హీరో బైక్‌ స్పష్టమైన ఆధిక్యం చూపుతోంది.

GST తగ్గింపుతో Hero Xpulse 210 ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. రోడ్డు మీదా, ఆఫ్‌ రోడ్‌లోనూ ఒకే స్థాయి కంఫర్ట్‌, కంట్రోల్‌, పవర్‌ అందించే బైక్‌గా ఇది నిలుస్తోంది. యువ రైడర్లకు ఈ ధరలో ఇంత పర్‌ఫెక్ట్‌ అడ్వెంచర్‌ బైక్‌ దొరకడం అరుదనే చెప్పాలి!.