కింగ్ ఖాన్ వార‌సుడిలా నిరూపిస్తాడా

1 month ago 2
ARTICLE AD

కింగ్ ఖాన్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా త‌న తొలి ప్ర‌య‌త్న‌మే క్రిటిక్స్ తో పాటు జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు తెర‌కెక్కించిన `ది బ్యా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ వీక్ష‌కులంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ నాయ‌కుడు, ఎంపీ శ‌శిథ‌రూర్ నుంచి అత‌డికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అయితే ఆర్య‌న్ ఖాన్ త‌ర‌హాలోనే మ‌రో స్టార్ కిడ్ కూడా ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. అత‌డే ద‌ళ‌ప‌తి విజ‌య్ కుమారుడు జాస‌న్ విజయ్. అత‌డు తండ్రిలా న‌టుడు కావ‌డం లేదు. ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేయాల‌నుకుంటున్నాడు. ఆరంభ‌మే పాన్ ఇండియ‌న్ స్టార్ దుల్కార్ స‌ల్మాన్ తో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ దుల్కార్ స్క్రిప్టును తిర‌స్క‌రించాడు. 

ఆ త‌ర్వాత తెలుగు న‌టుడు సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమాని ప్రారంభించాడు. అయితే ఆరంగేట్ర చిత్రంతో జాస‌న్ విజ‌య్ ఎలాంటి విజ‌యం అందుకుంటాడో చూడాల‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్ ఖాన్ వార‌సుడిలా జాస‌న్ విజ‌య్ నిరూపిస్తాడా లేదా? అన్న‌ది చూడాల‌న్న ఉత్కంఠ అంద‌రిలో ఉంది.

Read Entire Article