కన్ఫ్యూజన్‌లో విశ్వంభర టీమ్

11 months ago 7
ARTICLE AD

మెగాస్టార్ చిరంజీవి-వశిష్ఠ కలయికలో భారీ విజువల్ వండర్‌గా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం షూటింగ్ మొదలెట్టకముందే 10 జనవరి, 2025 రిలీజ్ అంటూ విడుదల తేదీని ప్రకటించేశారు. దానితో మెగా ఫ్యాన్స్ అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. కానీ గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్‌ని త్యాగం చేశారు. 

తమ షూటింగ్ అయిపోయినా.. కేవలం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసమే విశ్వంభర రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారని దిల్ రాజు గొప్పగా చెప్పారు. కానీ విశ్వంభర షూటింగ్ మాత్రమే కాదు.. విజువల్ కోసం సమయం కావాల్సి వచ్చే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరి నుంచి తప్పించారని అంటున్నారు. 

గతంలో వదిలిన విశ్వంభర టీజర్‌కి మిక్స్డ్ రెస్పాన్స్‌తో మేకర్స్ విఎఫ్ఎక్స్ పరంగా వచ్చిన కామెంట్స్ పై తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోనే విశ్వంభర తేదీని పోస్ట్ పోన్ చేశారట. గతంలో వర్క్ చేసిన గ్రాఫికల్ టీం ని తీసి కొత్త టీం‌మ్‌ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. బెటర్ విజువల్స్ కోసమే ఈ మార్పు అని తెలుస్తోంది. 

అది ఓ కొలిక్కి వస్తేనే విశ్వంభర రిలీజ్ తేదీని ప్రకటిస్తారని.. అది మార్చి లేదా మే లో విశ్వంభర రిలీజ్ డేట్ ఉండొచ్చని అంటున్నారు. మార్చిలో కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ ఉండటంతో.. విశ్వంభర విడుదల మే లోనే ఉండే అవకాశం ఉందనేలా టాక్ వినబడుతోంది. మరి ఈ కన్ఫ్యూజన్‌కి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాల్సి ఉంది.

Read Entire Article