కన్నప్ప టీజర్ 2 ఎలా ఉందంటే

9 months ago 7
ARTICLE AD

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న కన్నప్ప మూవీ నుంచి టీజర్ 2 వచ్చేసింది. ప్రతి సోమవారం ఏదో ఒక అప్డేట్‌తో ఈ సినిమాను వార్తలలో ఉంచుతూ వస్తున్న టీమ్, ఈసారి శనివారమే టీజర్ 2 వదిలి మంచు ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. టీజర్ 1, సాంగ్స్, పోస్టర్స్ ఇలా ప్రతీది సినిమా గురించి మాట్లాడుకునేలా చేయగా, ఈ టీజర్ 2 మాత్రం ఓ స్పెషల్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. 

సినిమాలోని మెయిన్ పాత్రలని పరిచయం చేస్తూ, సినిమా మెయిన్ కాన్సెప్ట్‌ని రివీల్ చేసిన టీమ్.. చివరిలో రుద్రగా ప్రభాస్ ఎంట్రీని చూపించి మెంటలెక్కించేశారు. అసలీ టీజర్‌లో ప్రభాస్ రోల్ ఉంటుందా? అనే అనుమానాల మధ్య అదిరపోయేలా ప్రభాస్ ఎంట్రీని చూపించారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, ఐశ్వర్య, ప్రీతి.. ఇలా అందరి పాత్రలను ఇందులో పరిచయం చేశారు. మంచు విష్ణు ఇందులో రెండు డైలాగ్స్ కూడా చెప్పారు. మొత్తంగా అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా కన్నప్ప టీజర్ 2 సిచ్యుయేషన్‌ని మార్చేసింది. 

టీజర్‌లో చెప్పుకోవడానికి గొప్పగా ఏం లేకపోయినా, సౌండింగ్‌లో గర్జించే రేంజ్ రాకున్నా.. రుద్రుడి ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఇక నుంచి కన్నప్పని చూసే కోణమే మారవచ్చు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. 

Read Entire Article