ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ హీరో సినిమా

9 months ago 7
ARTICLE AD

స్టార్ హీరో సినిమా కామ్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎవరా స్టార్ అనుకుంటున్నారా? కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన పట్టుదల (తమిళ్‌లో విడాముయర్చి) సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మార్చి 3 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అనుకున్నంత గొప్పగా ఈ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను 4 వారాల గ్యాప్‌లో ఓటీటీలోకి తెచ్చేశారు.

భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కింది. రాక్‌స్టార్‌ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు. అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అర్జున్, రెజీనా కసాండ్రా, అరుణ్ విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో పరాజయాన్ని చవిచూసిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి ఆదరణను రాబట్టుకుంటుందని యూనిట్ ఆశపడుతోంది. 

మరోవైపు ఈ సినిమా తర్వాత అజిత్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. 

Read Entire Article