ఎట్టకేలకు అమ్ముడైన దేవర శాటిలైట్ రైట్స్

1 month ago 2
ARTICLE AD

ఎట్టకేలకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర చిత్ర శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి. సినిమా విడుదలైన దాదాపు సంవత్సరం తర్వాత శాటిలైట్ రైట్స్, అందులోనూ ఎన్టీఆర్ సినిమా రైట్స్ అమ్ముడవడం అంటే, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలే పైరసీతో అల్లాడిపోతున్న ఇండస్ట్రీలో నిర్మాతలంతా డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ రూపంలో లాభాలు వస్తాయిలే అని సినిమాలు చేస్తున్నారు. కానీ, కొంతకాలంగా ఈ మార్కెట్ కూడా నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తుంది.

ఇప్పుడు దేవర విషయానికి వస్తే.. నిర్మాతలు చెప్పిన అమౌంట్‌లో సగం ధరకే స్టార్ గ్రూప్ ఈ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. అంటే డిజిటల్, శాటిలైట్ మార్కెట్స్ అన్నీ ఒక స్టాండ్ మీద నడుస్తున్నాయి. అందుకే సినిమాలకు ఇంకాస్త గడ్డు పరిస్థితి నెలకొంది. థియేట‌ర్ల‌లో విడుదలై చాలా కాల‌మైనప్ప‌టికీ ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజ్ కానీ స్టార్ హీరోల‌ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్‌లో నుంచి దేవరకు మోక్షం లభించినట్లుగానే భావించవచ్చు. 

దేవర హిందీ సినిమాను అక్టోబ‌ర్ 26న స్టార్ గోల్డ్‌లో ప్ర‌సార‌ం చేయబోతున్నట్లుగా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టన కూడా వచ్చేసింది. ఇక దేవ‌ర తెలుగు వెర్ష‌న్ దీపావ‌ళి లేదంటే ఆ త‌ర్వాత స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read Entire Article