ఉన్ని తో సినిమా చేస్తే సూసైడ్ చేసుకోవాలి

9 months ago 8
ARTICLE AD

మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ తో సినిమా చేస్తే సూసైడ్ చేసుకోవాలి అంటూ తనని కొందరు భయపెట్టారు అంటూ మలయాళ నిర్మాత సామ్ జార్జ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. గెట్ సెట్ బేబీ సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా ఉన్ని ముకుందన్ తో సినిమా చెయ్యాలని అనుకున్న సమయంలో నన్ను చాలామంది భయపెట్టారు. 

ఉన్ని ముకుందన్ తో సినిమా చేస్తే నష్టాలు, కష్టాలు తప్పవు, ఉన్ని ముకుందన్ ను హీరోగా తీసుకోవద్దు, ఒకవేళ ఉన్ని ముకుందన్ ను హీరోగా తీసుకొంటే నీవు సూసైడ్ చేసుకోనే పరిస్థితి ఎదురువుతుందని చాలామంది నన్ను భయపెట్టారు అంటూ సామ్ జార్జ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. 

కానీ నన్ను అందరూ భయపెట్టిన విధానానికి భిన్నంగా ఉన్ని ముకుందన్ ఈ సినిమా సెట్స్ లో వ్యవహరించారు. ఆయనతో పనిచేయడం హ్యాపీ గా ఉంది. ఒకవేళ నేను గనక చెప్పుడు మాటలు విని వింటే నేను ఆయనతో పనిచేసే గొప్ప అవకాశాన్ని కోల్పోయే వాడినని ఆ తర్వాత నాకు అర్ధమైంది. ఇలా కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ఉన్ని ముకుందన్‌కు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. 

Read Entire Article