Hero Xoom 125 Price, Mileage And Features In Telugu: హీరో మోటోకార్ప్, ఇటీవల, హీరో జూమ్ 125 అనే కొత్త స్కూటర్‌ను మన మార్కెట్‌లోకి (Hero Xoom 125 Launch) తీసుకొచ్చింది. ఇప్పటికే, 125 సీసీ కెపాసిటీ స్కూటర్లలో TVS Ntorq బాగా పాపులర్‌ కావడంతో, దానికి టఫ్‌ కంపిటీషన్‌ ఇవ్వడానికి హీరో ఈ Xoom 125 ని లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ కొనాలని ఆలోచిస్తున్న వాళ్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు ఇవి.

1. వేరియంట్స్‌ & ధరలు

హీరో జూమ్ 125 రెండు వెరియంట్స్‌లో లభిస్తోంది, అవి - VX & ZX.

హైదరాబాద్‌ & విజయవాడలో Hero Xoom VX ధర రూ. 91,316 (ఎక్స్‌-షోరూమ్‌).

Hero Xoom ZX ధర రూ. 99,916 (ఎక్స్‌-షోరూమ్‌, తెలుగు రాష్ట్రాలు).

ZX అనేది హయ్యర్‌ వేరియంట్‌ కావడం, VX తో పోలిస్తే ధరలో పెద్ద తేడా లేకపోవడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు ZX వైపు మొగ్గు చూపుతున్నారు.

2. వేరియంట్స్‌ మధ్య తేడాలు

Xoom VX వేరియంట్‌తో పోలిస్తే Xoom ZX వెరియంట్‌లో కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయి.

ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌

సీక్వెన్షియల్‌ ఇండికేటర్స్‌

ఫ్రంట్ ఏప్రాన్ స్టోరేజ్‌

అదనంగా ఎరుపు & పసుపు రంగులలో కూడా ZX లభిస్తుంది.

కేవలం రూ. 6,000 తేడాకే ఇవన్నీ లభించడం ZX ని మరింత ఆకర్షణీయంగా మార్చింది.

3. వీల్‌ సైజ్‌ & టైర్లు

Hero Xoom 125లో 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.

ముందు టైర్ సైజ్: 110/80

వెనుక టైర్ సైజ్: 120/70

ఈ టైర్‌ సైజులు బండి నడుపుతున్నప్పుడు మంచి కంఫర్ట్‌ని ఇవ్వడమే కాకుండా, రోడ్డుపై గ్రిప్‌ కూడా పెంచుతాయి.

4. బరువు & ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీ

Hero Xoom VX వేరియంట్‌ బరువు 120 కేజీలు.

Hero Xoom ZX వేరియంట్‌ బరువు 121 కేజీలు.

రెండు వేరియంట్లకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు.

ఈ బరువు స్కూటర్‌ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

5. బ్లూటూత్ కనెక్టివిటీ

హీరో జూమ్ 125లో Bluetooth-enabled LCD డాష్ ఉంటుంది. అయితే ఇది కేవలం ZX వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫీచర్‌తో రైడర్‌కు నావిగేషన్‌, కాల్ అలర్ట్స్ వంటి సౌకర్యాలు దొరుకుతాయి.

6. ఇంజిన్‌ పనితీరు

జూమ్ 125లో 124.6 cc సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది.

ఈ బండి ఇచ్చే గరిష్ట పవర్‌: 10 hp

గరిష్ట టార్క్‌: 10.4 Nm

ఈ స్పెక్స్ వల్ల, హీరో జూమ్ 125 సిటీ ట్రాఫిక్‌లోనూ, చిన్న ట్రిప్స్‌లోనూ ఝుమ్మంటూ దూసుకుపోతుంది, రైడర్‌కు చురుకైన డ్రైవింగ్‌ అనుభవం ఇస్తుంది.

హీరో జూమ్ 125 స్కూటర్‌ స్టైలిష్ డిజైన్‌, అందుబాటు ధర, అదనపు ఫీచర్ల కారణంగా మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలను, ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ధరలో పెద్దగా తేడా లేకపోయినా, VX వేరియంట్‌ కన్నా ZX వేరియంట్‌లో ఫీచర్లు ఎక్కువగా లభిస్తున్నందున, కొనుగోలు చేసే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది. TVS Ntorq వంటి బలమైన ప్రత్యర్థి ఇప్పటికే రోడ్డుపై తిరుగుతున్నప్పటికీ, హీరో జూమ్ 125 తన స్టైల్‌ & మోడ్రన్‌ ఫీచర్లతో కస్టమర్ల హృదయాలను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.