ఇంద్రకీలాద్రిపై ఆషాఢ శోభ: దుర్గమ్మకు పట్టుచీరతో ఉత్సవాల ఆరంభం!

3 months ago 9
ARTICLE AD

Sri Durgamalleswara Swamivarla Devasthanam: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాస మహోత్సవాల  జూలై 15 నుంచి  ఆగష్టు 12 వరకు వైభవంగా జరగనున్నాయి. ఆషాఢ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా జూలై 15 బుధవారం ఉదయం 07:30 గంటల నుంచి 07:45 గంటల మధ్య ఘాట్ రోడ్  (Ghat Road ఓం Turning) వద్ద ఆలయ అర్చకులు వేద పండితులు అమ్మవారికి పట్టుచీరను సమర్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవాల పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

ఆషాఢ గుప్త నవరాత్రి 2026: చిన్నమస్తా, ధూమావతి, మాతంగి సహా దశ మహావిద్యలు | పూజా విధానం, ఫలితాలు & శశ-మహాలక్ష్మి యోగం

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం..కనకదుర్గ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక కేంద్రం. కృష్ణా నది తీరాన ఉన్న ఈ పుణ్యక్షేత్రం గురించి కాలికా పురాణం, దుర్గా సప్తశతి వంటి గ్రంథాల్లో ఉంది. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలసినట్టు స్థలపురాణం. ఇక్కడ దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంలో ఎనిమిది భుజాలతో, ఆయుధాలు ధరించి భక్తులకు దర్శనమిస్తుంది.  శక్తి, సంపద, కరుణను భక్తులకు ప్రసాదించే అమ్మగా పూజలందుకుంటోంది దుర్గమ్మ.

ఏటా ఆషాఢ మహోత్సవాల్లో భాగంగా శాకాంబరి ఉత్సవాలు అత్యంత పవిత్రంగా జరుగుతాయి. ఈ సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, శాస్త్రోక్త విధానాలు, వేదపండితుల సమక్షంలో హోమాలు,అభిషేకాలు జరుగుతాయి. జూలై 15న అమ్మవారికి పట్టుచీర సమర్పించే కార్యక్రమంతో వేడుక మొదలవుతుంది. ఈ ఉత్సవాలు భక్తి, వైభవం, సంగీతం, నృత్యాలతో నిండి ఉంటుంది. లక్షలాది భక్తులు దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారు.

వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

ఇంద్రకీలుడు తపస్సు చేసిన ప్రదేశం కావడంతో ఇంద్రకీలాద్రి అయింది. దుర్గా దేవి మహిషాసురుడిని సంహరించి ఈ ప్రాంతాన్ని రక్షించినట్టు పురాణాలు చెబుతున్నాయ్. ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ఆషాఢ మాస ఉత్సవాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యేక సేవలు, మొక్కులు చెల్లించుకోవడం ద్వారా భక్తులు శుభాలు పొందుతారు.

ఆషాఢ మహోత్సవాలు నిర్వహణ  ప్రాచీన సంప్రదాయం. ఈ ఉత్సవాలు దుర్గా దేవి శక్తి, సంపద, రక్షణ స్వరూపాన్ని ఆరాధించేందుకు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంభరి రూపంలో ప్రత్యక్షమై సమస్త మానవాళికి ఆహార లోటు రాకుండా కాపాడుతుందని విశ్వాసం.

చోళుల కాలంనాటి శాసనాల్లోనూ ఆషాఢ మాసోత్సవాల గురించి ఉంది. అంటే ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. పట్టుచీర సమర్పించడం ద్వారా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటూ శాస్త్రోక్తంగా పూజలు , హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో అమ్మవారికి వివిధ రకాల ఆహారాలు, పూలు, ఆభరణాలు సమర్పిస్తారు. పకృతి సమృద్ధిగా ఉండే ఈ నెలలో లక్షలాది భక్తులు ఉత్సవాల్లో పాల్గొని దుర్గమ్మ కృపకు పాతృలవుతారు.

పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడివుచ్చినయమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

14-07-2026 మంగళవారం మీ రాశిఫలాలు!

Read Entire Article