ఆర్థిక ఇబ్బందులు తొలగించే శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహా  మంత్రం! తిరుమల శ్రీవారి ఆలయంలో ఉంది!

3 months ago 6
ARTICLE AD

Sri Srinivasa Aishwarya Maha Mantram: సంపద నిలవాలన్నా, అప్పుల బాధల నుంచి విముక్తి లభించాలన్నా భక్తిశ్రద్ధలతో ఈ మత్రం పఠిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు..

శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం తిరుమల క్షేత్రంలో రాసి ఉంది..ఈ మంత్రాన్ని పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.
ఎందుకంటే...ఎంత ధనం ఉన్నా, ఎంత సంపాదించినా కానీ ఏదో సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు ఎదరవుతుంటాయి, సమయానికి డబ్బు  చేతిలో లేకపోవడం, అవసరానికి ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం జరుగుతుంటుంది. మరికొందరు ఎంత సంపాదించినా వారికి ఉపశమనం ఉండదు. చేతిలో పైసా నిలవదు..అప్పులు చేయక తప్పదు. అలాంటివారు శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం పఠిస్తే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. ప్రాచీన కాలం నుంచి ఈ ఐశ్వర్య మహామంత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో వృద్ధి, సంతానానికి సంబంధించిన సమస్యలు, కోర్టు వ్యవహారాల్లో చికాకులు, మానసిక అశాంతి..ఇలా చాలా సమస్యలకు పరిష్కారం ఈ మంత్రం. ఈ మంత్రాన్ని ఇలా ఆన్ లైన్లో చదవడం కాదు.. ఓ పెన్ను, పేపర్ తీసుకుని...ఆ తెల్లటి పేపర్ కి నాలుగు వైపులా పసుపు రాయండి. గంధంతో బొట్టు పెట్టండి. ఆ గంధంతోనే శ్రీ అనే అక్షరం రాయండి. ఈ మంత్రాన్ని ఆ కాగితంపై రాసుకుని చదివితే మంచిది.

శ్రీ శ్రీనివాస ఐశ్వర్యమహామంత్రం (SriSrinivasa AishwaryaMahaMantram)

శ్రీ వత్స వక్షసం

శ్రీ శం

శ్రీ లోలం

శ్రీ కరగ్రహమ్

శ్రీ మంతం

శ్రీ నిధిమ్

శ్రీ ఢ్యం

శ్రీ నివాసం

భజేనిశం !

గమనించారా...ఇందులో మొత్తం 8 శ్రీలు ఉంటాయి. ఆది శంకరాచార్యులు స్వయంగా తిరుమల శ్రీనివాసుడి ఆనందనిలయంలో  శ్రీచక్రాన్ని, ఆకర్షణ ధన యంత్రాన్ని  ప్రతిష్టించిన తర్వాత...స్వామివారికి ఎదురుగా ఉన్న తోరణం మీద శిలాఫలకంపై   శిష్యులతో రాయించారని చెబుతారు. అంత విశిష్టత ఉన్న మంత్రం వల్లే తిరుమలకు విశేష ప్రాధాన్యత వచ్చిందనే ప్రచారమూ ఉంది

ఈ శ్లోకాన్ని ఒకరోజు రాసుకుని చదివేసి వదిలేయడం కాదు..

రోజూ ఒకే సమయానికి రాసుకుని చదవాలి

28 సార్లు..28 రోజులు రాయాలి

మీరు ఎంత భక్తితో అనుసరిస్తే అంత త్వరగా మీరు కోరుకున్న కోర్కె నెరవేరుతుంది

ఒక్కోసారి 28 రోజుల్లో మీ కోర్కె నెరేవరకుంటే..అది తీరేవరకూ రాస్తూనే ఉండాలి

ఓ రోజు కుదిరిందని..మరో రోజు చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు

భక్తితో పాటూ క్రమశిక్షణ కూడా ముఖ్యం

రాయడం రాదు కేవలం చదవగలం అనుకునేవారు రోజుకి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి

నిత్యం రాసే ఆ పేపేర్లను..ఎవరైనా హోమం నిర్వహిస్తే..రావిచెట్టు ఆకుకి చుట్టి ఆ గుండంలో వేయొచ్చు.

ఈ మంత్రం రాయడం, పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి..అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article