ఆ విష‌యంలో బుచ్చిబాబు ఎవ‌ర్ని అనుస‌రిస్తాడు

4 weeks ago 4
ARTICLE AD

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో  `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించి  ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో ఓ  భారీ స్పెషల్ సాంగ్  ఉంది. ఆ పాట‌కు  ఏ.ఆర్. రెహమాన్ అదిరిపోయే బాణీని స‌మ‌కూర్చారు. అయితే ఈ పాట చిత్రీకరణ విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ బాటలో నడుస్తారా? లేక రాజమౌళి శైలిని అనుసరిస్తారా? అన్నది  హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కోసం ఒకే ఒక స్టార్ హీరోయిన్‌ను ఎంచుకుంటారు. ఆ పాటను సినిమాకే హైలైట్‌గా మారుస్తుంటారు. `పుష్ప`లో సమంత, `రంగస్థలం`లో పూజా హెగ్డే ఆ పాట‌ల‌తో ఎంత సంచ‌ల‌నం అయ్యారో? తెలిసిందే. ఇప్ప‌టికే  బుచ్చిబాబు తన గురువు లాగే మృణాల్ ఠాకూర్  ని రంగంలోకి దించన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.  సింగిల్ హీరోయిన్‌తో ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు ఒక వాదన వినిపిస్తోంది. కానీ క్లారిటీ  లేదు.

మ‌రో వెర్ష‌న్ ఏంటంటే? ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి ముగ్గురు స్టార్ హీరోయిన్లు స్టెప్పులు వేయబోతున్నారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో రాజమౌళి తన `బాహుబ‌లి` సినిమాలో ఇరుక్కో పాట‌ను పాటతో ట్రెండ్ సెట్ చేసారు. ఆ పాట మంచి స‌క్సెస్ అయింది. ఒకే పాటలో ముగ్గురు భామలు కనిపిస్తే ఆ విజువల్ గ్రాండియర్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ మాట‌ను కూడా బుచ్చిబాబు కొట్టి పారేయ‌లేక‌పోతున్నాడు అన్న‌ది మ‌రో వెర్ష‌న్. మ‌రి  పెద్ది ఐటమ్ సాంగ్ విషయంలో బుచ్చిబాబు గురువు శైలిని ఫాలో అవుతాడా? లేక  రాజమౌళి తరహాలో భారీతనాన్ని జోడిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Entire Article