ఆ పాత్ర‌లో చిరంజీవి జ‌రిగే ప‌నేనా

1 week ago 2
ARTICLE AD

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` చిత్రం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ కి జోడీగా దీపికా ప‌దుకొణే ని తీసుకోవాల‌నుకున్నారు. కానీ దీపిక నో చెప్ప‌డంతో? ఆ బాధ్య‌త‌లు త్రిప్తీ డిమ్రీకి అప్ప‌గించాడు. కొరియన్ న‌టుడు డాన్ లీ అలియాస్  మాడాంగ్ సియోక్  విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన పేర్లు ఇవి.

 

మిగ‌తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎవ‌రు కనిపిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. కానీ సందీప్ కాస్టింగ్ ఎంపిక అన్న‌ది పాత్ర‌ల‌కు ప‌ర్పెక్ట్ గా సెట్ అవుతుంది. ఏ పాత్ర‌కు ఎలాంటి న‌టుడ్ని ఎంపిక చేయాల‌న్న విష‌యంలో సందీప్ ఎక్క‌డా రాజీ ప‌డ‌డు. పెద్ద స్టార్ల‌ను తీసుకు రాగ‌ల‌డు. చిన్న స్టార్ల‌తో సైత ఆ పాత్ర‌ల‌ను అద్భుతంగా పండించ‌గ‌ల‌డు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి మెగా స్టార్..బాలీవుడ్ నుంచి సంజ‌య్ ద‌త్, ర‌ణ‌బీర్ క‌పూర్ ల‌ను కూడా దించుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

ఇందులో చిరంజీవి  ప్ర‌భాస్ తండ్రి పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది జ‌రిగే ప‌నేనా? అంటే అందుకు ఎంత మాత్రం ఛాన్స్ లేదు. చిరంజీవి టాలీవుడ్ లో పెద్ద స్టార్. బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా 500 కోట్లు వ‌సూళ్లు తేగ‌ల స‌త్తా ఉన్న న‌టుడు. స‌రైన క‌థ ప‌డితే? ఆ లెక్క అంత‌కు మించి ఉంటుంది. అలాంటి స్టార్ నేటి జ‌న‌రేష‌న్ హీరోల‌కు అప్పుడే డాడ్ రోల్ అంటే? ఆ ప్ర‌చారం ఎంత మాత్రం న‌మ్మ డానికి వీలు లేనిదిగానే భావించాలి.

 

క‌థ‌ల ప‌రంగా చిరంజీవిలో మార్పు వ‌చ్చిన మాట వాస్త‌వం. ట్రెండ్ ను  ఫాలో అయ్యే క్ర‌మంలో కొత్త కొత్త‌గా ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తున్నారు. కానీ తండ్రి పాత్ర‌లు పోషించే సాహ‌సం అయితే ఇంకా చేయ‌రు. అందుకు  చాలా స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే చిరంజీవి స్లిమ్ లుక్ లోకి మారిపోయిన సంగ‌తి తెలిసిందే.  వ‌య‌సు 70 ఏళ్లు అయినా? అందులో స‌గం వ‌య‌సున్న స్టార్ గా ఛేంజ్ అయ్యారు.    

Read Entire Article