ఆ డేట్ పై స్వయంభు కన్ను

1 month ago 5
ARTICLE AD

కార్తికేయ 2 పాన్ ఇండియా ఫిలిం తర్వాత నిఖిల్ నుంచి ఎలాంటి మూవీ వస్తుంది, అది ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ప్రశ్నలకు ఆయన నటిస్తున్న స్వయంభు సమాధానమిస్తుంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న స్వయంభు షూటింగ్ ఎప్పటినుంచో జరుగుతున్నా.. సినిమా విడుదలకు కూడా మేకర్స్ చాలా సమయం తీసుకున్నారు.

రీసెంట్ గా వచ్చిన స్వయంభు టీజర్, అందులోని గ్రాఫిక్స్ చూసాక స్వయంభు పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా కి పర్ఫెక్ట్ మూవీ స్వయంభు అంటూ అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఈసినిమా విడుదల తేదీపై సస్పెన్స్ నెలకొంది. అసలైతే ఏప్రిల్ లో విడుదల అన్నారు.

తాజాగా స్వయంభు కన్ను ఏప్రిల్ 17 పై ఉంది అని, మేకర్స్ ఆ డేట్ ని లాక్ చేసుకున్నారని టాక్. అంతేకాకుండా స్వయంభు డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. ఆ డీల్ కి సంబందించిన చర్చలు జరుగుతున్నాయట. మరోపక్క ఏప్రిల్ 17 రిలీజ్ అంటున్నా ఇంకా క్లైమాక్స్ సీ జీ లు బ్యాలెన్స్ ఉన్నట్లుగా సమాచారం.

మరి స్వయంభు ఏప్రిల్ 17 రిలీజ్ అంటే పాన్ ఇండియా మార్కెట్ కోసం ముందే డేట్ అనౌన్స్ చేస్తే మంచిది అనేది నిఖిల్ అభిమానుల కోరిక. మరి మేకర్స్ ఆలోచన ఎలా ఉందొ చూడాలి. 

Read Entire Article