అలాంటి వారిని అల‌రించ‌లేము: ఐశ్వ‌ర్యారాయ్

4 weeks ago 2
ARTICLE AD

ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ పాతికేళ్ల క్రితం మొద‌టిసారి ఓ సినిమా కోసం క‌లిసి ప‌ని చేసారు. కుచ్ నా కహో, బంటీ ఔర్ బబ్లి, సర్కార్ రాజ్, ధూమ్ 2, గురు, ఉమ్రావ్ జాన్, రావ‌ణ వంటి చిత్రాల‌కు క‌లిసి ప‌ని చేసారు. మ‌ణిర‌త్నం `గురు` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఐష్- అభి జంట ప్రేమాయ‌ణం గురించి చాలా చ‌ర్చ సాగింది. 2007లో అంద‌మైన జంట వివాహం అయింది. వారికి ఆరాధ్య అనే కుమార్తె జ‌న్మించింది.

దాదాపు 18 సంవ‌త్స‌రాల దాంప‌త్య జీవితం అనంత‌రం వారిపై ఊహించ‌ని ప్ర‌చారం మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. వారి కుటుంబంలో క‌ల‌త‌లు ఉన్నాయ‌ని, విడిపోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. కొన్ని మీడియాలు ఈ జంట విడాకుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసార‌ని కూడా ప్ర‌చారం సాగించాయి. కానీ ఇవ‌న్నీ కేవ‌లం పుకార్లు మాత్ర‌మేన‌ని ఓఫ్రా విన్ ఫ్రే షోలో ఐష్ జ‌వాబిచ్చారు. హోస్ట్ విడాకుల గురించి ప్ర‌శ్నించ‌గా, ఐశ్వర్య వెంటనే అలాంటి ఆలోచనను అలరించడానికి కూడా ప్రయత్నించము! అని చెప్పింది.

అయితే కాపురంలో క‌ల‌త‌ల గురించి ఐష్ బ‌హిరంగంగా మాట్లాడింది. దంప‌తుల మ‌ధ్య చాలా సర్దుబాటు, చాలా ఇవ్వడం, తీసుకోవడం వంటివి ఉంటాయి. విభేదాలు ఉంటాయి. కానీ కమ్యూనికేషన్‌ను కొనసాగించడం ముఖ్యం అని ఐష్ అన్నారు. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య‌ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.. అని అన్నాడు.

ప్రతి రోజు భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌యం గ‌డ‌ప‌డం చాలా ముఖ్యం. టైమ్ ని ఎలా షేర్ చేసుకుంటారో, ప్ర‌తిదీ ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. భాగస్వామిని గౌరవించడం, సున్నితంగా ఉండటం వంటివి కాపురంలో కీల‌క భూమిక‌ను పోషిస్తాయి... అని కూడా వివ‌రించారు. ఇటీవ‌ల ఈ జంట విడిపోతున్నారంటూ వ‌చ్చిన పుకార్ల‌ను ఇద్ద‌రూ ఖండించారు.

Read Entire Article