అప్ప‌ట్లా ఇప్పుడు సాధ్యం కాదోయ్!

16 hours ago 1
ARTICLE AD

ఒక‌ప్పుడు రెండు..మూడు ప్లాపులు ఎదురైనా స్టార్ డైరెక్ట‌ర్ అనే ట్యాగ్ తో స్టార్ హీరోలు పిలిచి మ‌రీ ఛాన్స్ ఇచ్చేవారు. స్టోరీ న‌చ్చితే మిగ‌తా విష‌యాలు పెద్ద‌గా ప‌రిగ‌ణ‌లోకి వ‌చ్చేవి కాదు. అప్ప‌టికే అదే హీరోకి ఓ హిట్ ఇచ్చిన న‌మ్మకం  మీద ముందుకెళ్లిపోయేవారు.  తెలిసిన డైరెక్ట‌ర్...భ‌విష్య‌త్ లో ఇంకా క‌లిసి చాలా ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది? అన్న‌ది కూడా క‌నిపించేది. మొత్తంగా అప్ప‌ట్లో డైరెక్ట‌ర్ అంటే ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉండేది.

కానీ  ఇప్పుడు స‌న్నివేశం మారింది అన్న‌ది కాద‌న‌లేని నిజం. హిట్ ఇచ్చినా?  హీరోల కోసం వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. పాన్ ఇండియాలో ఓ 1000 కోట్ల హిట్ ఇస్తే త‌ప్ప స్టార్ హీరోలెవ‌రూ డేట్లు ఇవ్వ‌లేదు.  హిట్ డైరెక్ట‌ర్ అదే స్టార్ హీరోకి క‌థ చెప్పాలంటే?  అపాయింట్ మెంట్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. ఆ హీరో క‌థ వినాలి అనుకుంటే?  గ‌నుక ఆ డైరెక్ట‌ర్ కి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వెరిపికేష‌న్ అవుతుంది.

బ్యాక్ గ్రౌండ్ అంటే? గ‌తంలో అత‌డు సాధించిన  విజ‌యాలు...ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడా?  లేదా? ఇలాంటి డేటా చూసి అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. ఇందులో ఎక్కడ రిమార్క్ ఉన్నా?  క‌నీసం స్టోరీ వినే అవ‌కాశం కూడా హీరోలు ఇవ్వ‌డం లేదు.  పూరి జ‌గ‌న్నాధ్, వంశీ పైడిప‌ల్లి అప్ప‌ట్లో ఓ స్టార్ హీరోకి మంచి విజ‌యాలు అందించిన వారే. వీళ్ల‌లో ఓ డైరెక్ట‌ర్ ఆ స్టార్ హీరోకి మంచి స్నేహితుడు కూడా. వ్య‌క్తిగ‌తంగా రెండు కుటుంబాల మ‌ధ్య మంచి రిలేష‌న్ షిప్ కూడా ఉంది.

కానీ ఆ డైరెక్ట‌ర్ ని  కూడా ఆ హీరో దూరం పెట్టాడా? అన్న సందేహాలు తాజాగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ డైరెక్ట‌ర్ చివ‌రికి బాలీవుడ్ కి  వెళ్లి స‌ల్మాన్ ఖాన్ కి కూడా స్టోరీ చెప్ప‌గ‌లిగాడు గానీ, ఆ టాలీవుడ్  హీరోకి మాత్రం స్టోరీ చెప్పే ఛాన్స్  లేకుండా పోయింది. ఆ హీరో విష‌యంలో పూరి కూడా అంతే అసంతృప్తిగా ఉన్నాడు అన్న‌ది కాద‌న‌లేని నిజం.

Read Entire Article