అను కి అవకాశం దక్కేనా

3 weeks ago 2
ARTICLE AD

హీరోయిన్ గా సౌత్ లో అదృష్టాన్ని పరిక్షించుకుని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ సక్సెస్ దక్కక కొద్దిరోజులుగా టాలీవుడ్ కి దూరంగా అసలు సోషల్ మీడియాలో కూడా కనిపించని హీరోయిన్ అను ఇమ్మానుయేల్.. చాలా రోజుల తర్వాత రష్మిక గర్ల్ ఫ్రెండ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో అను ఇమ్మానుయేల్ డీసెంట్ పాత్రలో కనిపించింది.

ఆమె తన పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ చిత్రం సక్సెస్ దిశగా పరుగులు పెడుతుంది. ఎంతగా రష్మిక చిత్రంగా ప్రొజెక్ట్ అయినా.. అందులో అను ఇమ్మానుయేల్ కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రం తో కమ్ బ్యాక్ ఇచ్చిన అను ఇమ్మానుయేల్ కి ఇకపై అవకాశాలు క్యూ కడతాయా.. అనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఆమెకు సోలో గా హీరోయిన్ పాత్రలు వస్తాయనడంలో సందేహమే అయినప్పటికీ.. ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ ఇకపై హీరోయిన్ గానే కాదు కీలక పాత్రలు వచ్చిన ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. చూద్దాం అను ఇమ్మానుయేల్ డెసిషన్, ఆమె అదృష్టం ఎలా ఉందొ అనేది. 

Read Entire Article