అనగనగ ఒక రాజు ఓటీటీ కొచ్చేస్తుంది

3 months ago 12
ARTICLE AD

సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి తో పాటుగా ప్రభాస్ రాజసాబ్ స్ట్రీమింగ్ లోకి రాగా.. మన శంకర వరప్రసాద్ గారు ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ లోకి తెస్తున్నారు. దానితో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తి నెలకొంది.

థియేటర్స్ లో రూ.100 కోట్లు కొట్టి చూపించిన హిట్టు బొమ్మ అనగనగ ఒకరాజు ఫైనల్ గా థియేట్రికల్ రన్ ముగియడంతో మేకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేసారు. అనగనగ ఒకరాజు చిత్రాన్ని ఫ్యాన్సీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. 

జనవరి 14 న థియేటర్స్ లో విడుదలై హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11 నుంచి అనగనగా ఒక్కరాజు చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది. సో థియేటర్స్ లో మిస్ అయిన ఈ హిట్ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ లో వీక్షించేయ్యండి. 

Read Entire Article