అనంత చతుర్దశి 2025 : మీ రాశి ప్రకారం మీరు ఏ రంగు అనంత సూత్రాన్ని కట్టుకోవాలి? ఏ మంత్రం జపించాలి?

3 months ago 3
ARTICLE AD

Anant Sutra According To Your Zodiac Sign : అనంత చతుర్దశి పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ 6న జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు అనంత రూపాన్ని పూజిస్తారు. పూజలో భాగంగా భక్తులు పవిత్రమైన అనంత సూత్రం కట్టుకుంటారు.  ఇదే రోజు వినాయక నిమజ్జనం చేస్తారు.

అనంత చతుర్దశి రోజు మీశక్తి, భక్తి కొలది శ్రీ మహావిష్ణువును పూజించిన తర్వాత ఓ సూత్రాన్ని చేతికి కట్టుకుంటారు.  అదే అనంత సూత్రం. ఈ అనంతసూత్రంలో మొత్తం 14 ముడులు ఉండాలి. 14 ముడులు 14 లోకాలు ప్రతీకగా చెబుతారు. విష్ణుపూజ తర్వాత శ్లోకం చదువుతూ అనంతసూత్రాన్ని కట్టుకుంటే జీవితంలో వెంటాడుతున్న చికాకులు తొలగిపోయి సంతోషం నిండుతుందని విశ్వసిస్తారు.

అనంత సూత్రం... విష్ణువు  శాశ్వత రక్షణకు చిహ్నంగా భావిస్తారు. ఈ దారాన్ని కట్టడం ద్వారా లక్ష్మీదేవి  నారాయణుడు తమ భక్తులను ప్రతి సంక్షోభం నుంచి రక్షిస్తారని నమ్ముతారు. సాధారణంగా అనంత సూత్రం ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. అయితే మీ  రాశి ప్రకారం రంగులు ధరించడం వల్ల గ్రహాల అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి రాశి ఒక నిర్దిష్ట రంగు,  మంత్రంతో అనంతసూత్రం ధరించాలి.

మీ రాశి ప్రకారం అనంత చతుర్దశి రంగులు - జపించాల్సిన మంత్రం

మేష రాశి, వృశ్చిక రాశి

ఈ రెండు రాశులవారు "ఓం పాదాయ నమః" అని జపిస్తూ 14 ముడులతో ఎరుపు అనంత సూత్రాన్ని కట్టుకోవాలి. ఈ రంగు కుజుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.

వృషభ రాశి, కర్కాటక రాశి, తులా రాశి

ఈ మూడు రాశులవారు పసుపు పూసిన తెల్లటి దారాన్ని అనంతసూత్రంగా కట్టుకోవాలి.  "ఓం శిఖినే నమః" అనే మంత్రం జపించండి.

మిథున రాశి , కన్యా రాశి

ఈ రెండు రాశులవారు "ఓం దేవదేవ నమః" అని జపిస్తూ ఆకుపచ్చ దారాన్ని కట్టుకోవాలి.  ఈ రంగు బుధుడికి ప్రీతికరమైనది ,  సానుకూలతను ఆకర్షిస్తుంది.

సింహ రాశి

ఈ రాశివారు "ఓం అనంతాయ నమః" అని పఠిస్తూ నారింజ రంగు అనంత సూత్రాన్ని ధరించండి. ఇది ఏకాగ్రతను పెంచుతుంది

ధనుస్సు రాశి , మీన రాశి

ఈ రెండు రాశులవారు "ఓం రత్ననాభః నమః" అని జపిస్తూ పసుపు దారాన్ని కట్టుకుంటే బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఇది జ్ఞానం, సంపద   ఆనందాన్ని పెంచుతుందని విశ్వాసం

మకర రాశి, కుంభ రాశి

శని దేవుడికి నచ్చిన రంగు నలుపు..కానీ అనంతసూత్రాన్ని నలుపుతో కట్టుకోకూడదు. అందుకే ఈ రెండు రాశులవారు పసుపు, నీలం దారాలను అనంతసూత్రంగా ధరించాలి. "ఓం శ్రీ విష్ణవే నమః" అని జపించాలి

శ్రీ మహావిష్ణువు ప్రార్థన

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

Read Entire Article