అగ్రిమెంట్ పూర్తి కాకుండానే బ‌య‌ట‌కొచ్చేసిందా

2 months ago 7
ARTICLE AD

బాలీవుడ్లో వారసుల్ని ప‌రిచ‌యం చేయ‌డంలో అగ్ర‌గామి సంస్థ ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్ ముందుంటుంది. ఇప్ప‌టికే అదే సంస్థ ద్వారా నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఎంతో మంది న‌టీన‌టుల్ని ప‌రిచ‌యం చేసారు. ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్ అంటే వార‌సులంతా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. ఆ సంస్థ ద్వారా ప‌రిచ‌య‌మైతే? స‌క్సెస్ కి  అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని చాలా మంది సెంటిమెంట్ గానూ భావిస్తుంటారు. వార‌సుల విష‌యంలో క‌ర‌ణ్ జోహార్ జోహార్ కూడా అంతే గొప్ప‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

వారి స్థాయిని ఏమాత్రం త‌గ్గించుకుండా లాంచ్ చేయ‌డంలో క‌ర‌ణ్ స్పెష‌లిస్ట్. అయితే లాంచ్ అయ్యే  ముందు కొన్ని కండీష‌న్స్ కు లోబ‌డి వారంతా ప‌ని చేయాల్సి ఉంటుంది. ఇదే కోవ‌లో అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ కూడా ప‌రిచ‌య‌మైన సంగ‌తి  తెలిసిందే. `ధ‌డ‌క్` సినిమాతో అమ్మ‌డిని క‌ర‌ణ్ లాంచ్ చేసారు. అప్ప‌టి నుంచి జాన్వీ కెరీర్ లో ముందుకెళ్తుంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ ధర్మా కార్నర్‌స్టోన్ ఏజెన్సీ  నుండి బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

అంటే? ధర్మా ప్రొడక్షన్స్ తో  విబేధించి రావ‌డం కాదు. ఇది కేవలం వ్యాపారపరమైన, కెరీర్ మేనేజ్‌మెంట్ కి  సంబంధించిన‌ మార్పు మాత్రమే. జాన్వీ ఇంత‌కాలం ఎండార్స్ మెంట్స్, సినిమాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నింటిని డీసీఏ చూసుకునేది. ఇప్పుడా బాధ్య‌త‌లన్నింటిని  ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ చూసుకుంటుంది. అయితే జాన్వీ క‌పూర్ ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుంది?  డీసీఏ నుంచి అగ్రిమెంట్ పూర్త‌యిందా? మ‌ధ్య‌లోనే బ్రేక్ చేసిందా? అన్న దానిపై క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ `పెద్ది` లో  హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read Entire Article