అఖండ 2 కి ఓవర్సీస్ కష్టాలు

4 months ago 6
ARTICLE AD

అఖండ 2 డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఎంతో సస్పెన్స్ నడుమ ఎట్టకేలకు డిసెంబర్ 12 న సినిమా విడుదలకు రెడీ అయ్యింది. విడుదలకు కేవలం రెండు రోజుల ముందు రిలీజ్ డేట్ లాక్ చెయ్యడంతో ఏపీ, తెలంగాణ లోని థియేటర్స్ అలాగే  ఓకే కానీ ఓవర్సీస్ లో మాత్రం అఖండ 2 కి  చేసి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యడం ఛాలెంజింగ్ గా మారింది. 

డిసెంబర్ 11 రాత్రి నుంచే అఖండ 2 ప్రీమియర్స్ కి రెండు రాష్ట్రాల్లో సందడి మొదలైపోయింది. మరికాసేపట్లో బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో అఖండ 2కి కాస్త కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందుగా డిసెంబరు 5 రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని బుక్ చేసిన థియేటర్లను, విడుదల వాయిదా పడడంతో ఆ థియేటర్స్ అన్నిటిని ఇతర సినిమాలకు కేటాయించేశారు. 

ఇప్పుడు డిసెంబర్ 12 న అఖండ 2 రిలీజ్‌కు వచ్చేసరికి చాలా తక్కువ స్క్రీన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ ని ఈ తక్కువ స్క్రీన్స్ తో తేవడం చాలా కష్టమైన పనే. లాస్ట్ మినిట్ లో థియేటర్లు అడ్జస్ట్ చేయడం పెద్ద ఛాలెంజ్.. అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఒకటి ట్వీట్ చేసింది. 

అయినప్పటికీ  అఖండ 2 థియేటర్స్ విషయంలో విజయం సాధించాం, మీ షెడ్యూల్స్‌కు అనుగుణంగా షోస్ ప్లాన్ చేసేందుకు మీ మద్దతు కావాలి. థియేటర్లు షోటైమ్స్ ఫైనల్ చేస్తున్నాయి. ఈ రాత్రి లేదా రేపు పూర్తి లిస్ట్ ప్రకటిస్తాం. ఫిబ్రవరి 11న USAలో గ్రాండ్ ప్రీమియర్స్ ఉంటాయి అంటూ ట్వీట్ చేసింది. 

Read Entire Article