అకీరా తో పంజా దర్శకుడి సినిమా

10 months ago 8
ARTICLE AD

ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన పంజా సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ప్రేమిస్తావా ఈ నెల 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో విష్ణు వర్ధన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఓ విలేకరి పవన్ కల్యాణ్ తనయుడు అక్కిరా నందన్‌తో పంజా సీక్వెల్ చేయడానికి ఆసక్తి ఉందా..? లేదా కొత్త సినిమా ప్లాన్ చేస్తారా..? అని ప్రశ్నించగా.. విష్ణు వర్ధన్ స్పందిస్తూ తాను ఇప్పటివరకు ఏమీ ప్లాన్ చేయలేదని, కానీ సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అకీరా తో సినిమా చేయాలని ఉందని తెలిపారు. పంజా కూడా ముందుగా ప్రణాళికలు లేకుండా తెరకెక్కినదే అని ఆయన గుర్తు చేశారు.

పంజా తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోవడానికి కారణాలను వివరిస్తూ తాను కథల విషయంలో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేయడానికే ఆసక్తి చూపుతానని అన్నారు. సినిమా ఫలితాలను పట్టించుకోకుండా డిఫరెంట్ జానర్లను ఎక్స్‌ప్లోర్ చేయడమే తన ధోరణి అని తెలిపారు. షేర్షా వంటి కొత్త ప్రయోగాలు తనకు మంచి అనుభవాన్ని ఇచ్చాయని చెప్పారు. పంజా తర్వాత కొన్ని తెలుగు ప్రాజెక్ట్‌ల కోసం అవకాశాలు వచ్చినా ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో వాటిని చేయలేకపోయానని వెల్లడించారు.

Read Entire Article