అందరూ లోకేష్ ను కాపీ కొట్టేవాళ్లే

9 months ago 8
ARTICLE AD

ఒకప్పుడు లోకేష్ ను పప్పు అతను సరిగ్గా మాట్లాడలేదు, అంతటితో మాట్లాడుతాడు అంటూ కామెంట్స్ చేసినా వారే ఈరోజు లోకేష్ షైన్ అయిన తీరును తెగ పొగుడుతున్నారు. 2024 ఎన్నికల సమయానికి యువగళం పాదయాత్రతో షార్ప్ గా తయారైన నారా లోకేష్ 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి బంపర్ మెజారిటీతో గెలవడమే కాదు విద్యాశాఖ మంత్రి గా బ్రహ్మాండంగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. 

అయితే 2019 నుంచి 2024 మధ్యన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, మంత్రులు, వైసీపీ నేతలు, వైసీపీ తొత్తులుగా మారిన అధికారులు చేసిన అరాచకాలకు లోకేష్ రెడ్ బుక్ పెట్టి టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి అవినీతి భాగోతాలను, వార్ చేసిన అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడతా అంటూ రెడ్ బుక్ పంచాయితీకి తెరలేపాడు. 

ఒకప్పుడు లోకేష్ ను పప్పు అన్నవాళ్ళే ఈరోజు లోకేష్ ను కాపీ కొడుతున్నారు, లోకేష్ రెడ్ బుక్ అప్పుడు చాలా సన్సేషనల్ అయ్యింది. ఇప్పుడు అదే మాదిరి కూటమి ప్రభుత్వం తమని వేధిస్తుంది మేము కూడా డైరీ రాస్తామని జగన్, అటు గులాబీ నేత ముద్దు బిడ్డ కవిత పింక్ బుక్ రాస్తామని, కాంగ్రెస్ వాళ్ళ అంతు తేలుస్తామని మాట్లాడడం ప్రజలకు నవ్వు తెప్పిస్తుంది. 

లోకేష్ ను ఫాలో అవుతూ బుక్ లు రాస్తారా, లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు పింక్ బుక్ అంటారా అంటూ కామెడీగా మాట్లాడుకుంటున్నారు. అన్నట్టు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నడవడం లేదు. ఏపీ ప్రభుత్వం న్యాయబద్దంగా ముందుకు వెళుతుంది. తప్ప లోకేష్ రెడ్ బుక్ ఎక్కడా వాడినట్లుగా లేదు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Read Entire Article