అందంతో క‌వ్విస్తున్న భాగ్య‌శ్రీ బోర్సే

1 month ago 6
ARTICLE AD

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తిష్ట వేసింది ముంబై బ్యూటీ భాగ్య‌శ్రీ‌. కేవలం అందంతోనే కాదు.. తనదైన కిల్లర్ లుక్స్.. అదిరిపోయే మూవ్స్‌తో వెండితెరపై మ్యాజిక్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో భాగ్య‌శ్రీ‌ షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. భాగ్యశ్రీ కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు.. నటనలోనూ తనదైన ముద్ర వేస్తోంది.

సాధారణంగా హీరోయిన్లకు తొలి సినిమా ఫలితం కెరీర్‌ను శాసిస్తుంది.. కానీ భాగ్యశ్రీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ వరుసగా క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రామ్ పోతినేని సరసన నటించిన ఆంధ్రా కింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయినా..భాగ్యశ్రీ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆశించిన‌న్ని పెద్ద సినిమాలేవీ లేక‌పోయినా కానీ, త‌దుప‌రి తెలుగు యువ‌హీరోల స‌ర‌స‌న భారీ చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం ల‌భించింద‌ని తెలుస్తోంది. అక్కినేని అఖిల్ స‌ర‌స‌న లెనిన్ చిత్రంలోలో భాగ్యశ్రీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాల కోసం కూడా మేకర్స్ ఈ భామ‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియా మొత్తం తన వైపు చూసేలా అందంతో క‌వ్విస్తున్న‌ ఈ మరాఠీ ముద్దుగుమ్మ.. అటు గ్లామర్ పరంగా ఇటు పర్ఫార్మెన్స్ పరంగా బాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. పెద్ద బ్యానర్ల నుంచి వస్తున్న అవకాశాలను ఒడిసి పట్టుకుంటూ తన కెరీర్‌ను చాలా ప్లాన్డ్ గా బిల్డ్ చేసుకుంటోంది.

Read Entire Article