అంత‌ర్జాతీయ సినీ వేడుక‌ల్లో ర‌జ‌నీకి స‌న్మానం

3 weeks ago 2
ARTICLE AD

గోవాలో ఈ ఏడాది అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్న ఇఫీ (ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా) ఉత్స‌వాల‌లో సూప‌ర్ స్టార ర‌జనీకాంత్ ని స‌న్మానించ‌నున్నారు.  నవంబర్ 20న గోవాలో ఈ ఉత్స‌వాలు ప్రారంభం కానుండ‌గా ఇప్ప‌టికే ఏర్పాట్లు ఘ‌నంగా సాగుతున్నాయి. ఈసారి ఉత్స‌వాల‌లో ఏఐ సాంకేతిత‌, హ్యాక‌థాన్ వంటి అంశాల‌తో పాటు సినీరంగంలో టెక్నాల‌జీ గ‌మ‌నం గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగ‌నుంది.

9 రోజుల పాటు  సాగే ఈ సినీ ఉత్సవంలో 81 దేశాల నుండి 240 కి పైగా సినిమాలు ప్రదర్శించ‌నున్నారు.  50 మందికి పైగా మహిళా దర్శకులు తమ చిత్రాలను ప్రదర్శించడం మ‌రో కొస‌మెరుపు. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా సాగ‌నున్న ఈ ఉత్స‌వాల‌లో లెజెండ‌రీ ర‌జ‌నీకాంత్ ని ముగింపు ఉత్స‌వాల్లో స‌న్మానించేందుకు ఇఫీ ఏర్పాట్లు చేస్తోంది. సినిమాకు క‌ళారంగానికి 50 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందించిన మేటి సినీదిగ్గ‌జం ర‌జ‌నీకి ఇది ఘ‌న‌మైన స‌త్కారం కానుంది. దిగ్గ‌జ సినీప్ర‌ముఖులు  గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, పి. భానుమతి, భూపేన్ హజారికా, సలీల్ చౌదరికి శతాబ్ది నివాళులను ఇఫీ వేదిక‌గా అర్పించ‌నున్నారు. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ నుంచి అమీర్ ఖాన్, విధు వినోద్ చెప్రా, అనుప‌మ్ ఖేర్, సుహాసిని మ‌ణిర్త‌నం, శ్రీ‌క‌ర్ ప్రసాద్ స‌హా 21 మంది టాప్ టెక్నీషియ‌న్స్ ఈ వేడుక‌ల్లో పాల్గొంటున్నారు.

సంప్రదాయానికి భిన్నంగా అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండదు. బదులుగా పనాజీ లో ఒక గ్రాండ్ కవాతు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (సినిమాలు) అజయ్ నాగభూషణ్ మాట్లాడుతూ... ఈ ఉత్సవానికి 127 దేశాల నుండి రికార్డు స్థాయిలో 2,314 మంది స‌మ‌ర్ప‌ణ‌ల‌ను పంపార‌ని చెప్పారు. ఇది గ్లోబల్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో IFFI కి పెరుగుతున్న ప్రాముఖ్యతను చూపిస్తుంద‌ని ఆయన అన్నారు.

Read Entire Article