Zuckerberg Wears 900000 Dollers Watch: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా యజమాని అయిన మార్క్ జుకర్ బెర్గ్ చాలా సింపుల్ గా కనిపిస్తారు. చాలా నిరాడంబర జీవితాన్ని గడుపుతారని చెప్పుకుంటారు. ఎంతో అరుదైన సందర్భాల్లో తప్ప ఆయన సూట్ వేయరు. సాధారణంగా టీ షర్టుల్లోనే ఉంటారు. కానీ ఆయన పెట్టుకునే వాచ్ విలువ మాత్రం కోట్లలో ఉంటుంది. తాజాగా ఫేస్ బుక్ లో ఓ మార్పు గురించి ప్రకటన చేసేందుకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. అందరూ ఆ ప్రకటన గురించి పట్టించుకోలేదు. ఆ వీడియోలో ఆయన పెట్టుకున్న వాచ్ పై మాత్రం దృష్టి పెట్టారు. ఎందుకంటే దాని విలువ 8 కోట్ల రూపాయల పైమాటే అన్నమాట.

ప్రపంచ ధనవంతుల్లో ఒకరు అయిన జుకర్ బెర్గ్ కు రూ. ఎనిమిది కోట్ల విలువైన వాచ్ పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఎప్పుడూ ఆయన తన ధన ప్రదర్శన చేయలేదు. అందుకే కొత్తగా ఎనిమిది కోట్ల విలువైన వాచ్ పెట్టుకునేసరికి ఆ వాచ్ ప్రత్యేకతల గురించి ఇంటర్నెట్ చర్చించడం ప్రారంభించారు.

మార్క్ జుకర్‌బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9 లక్షల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఎనిమిది కోట్ల రూపాయలకంటే ఎక్కువ. ఇంత ధర ఉండాలంటే ఎన్ని ప్రత్యేకతలు ఉండాలి. అన్నీ ఉంటాయి. ఇది స్విస్ తయారీ లిమిటెడ్ ఎడిషన్ వాచ్. ప్రపంచంలోని అత్యంత కుబేరుల వద్దనే ఉంటుంది. భారత్ లో అనంత్ అంబానీ ఇలాంటి వాచ్ ధరించి చాలా సార్లు మీడియాకు కనిపించారు.

ప్రఖ్యాత స్విస్ వాచ్‌మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్‌లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని ఏడాదికి రెండు .. లేకపోతే మూడు మాత్రమే తయారు చేస్తుంది. జుకర్ బెర్గ్ దగ్గర ఇంకా చాలా ఖరీదైన వాచ్‌లు ఉన్నాయని అమెరికన్ మీడియా చెబుతోంది. వాచ్‌ల మీద మార్క్ జుకర్‌బర్గ్ కు చాలా ఆసక్తి ఉంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి వచ్చినప్పుడు జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన వాచ్‌ను ఆసక్తిగా చూశారు. ఇప్పుడు అలాంటి వాచ్ తోనే కనిపించారు.

Which PR person failed to advise Mark Zuckerberg that it might be a bad idea to announce he was “getting rid” of the work of 40,000 moderators while wearing a $895,000 watch? pic.twitter.com/PwRTttcQXb

— Conrad Quilty-Harper (@Coneee) January 8, 2025

అయితే అనంత్ అంబానీ వాచ్ ఇంకా ఖరీదైనదని చెబుతున్నారు. ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని చెబుతారు.

Also Read : Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం