YSRCP Blast: మంగళవారం సాయత్రం ఏడు గంటలకు బ్లాస్టింగ్ విషయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం ఏడుగంటలకు ఓ పోస్టు పెట్టింది. వంశీ అరెస్టు ల‌క్ష్యంగా చంద్రబాబు స‌ర్కార్ కుట్ర‌లు చేసిందని సత్యవర్థన్ కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్ ను బయట పెట్టారు. గ‌న్న‌వ‌రం కేసులో క‌ట్టుక‌థ‌లు, క‌ల్పితాలు, త‌ప్పుడు సాక్ష్యాలు, అక్ర‌మ అరెస్టులు అని మండిపడింది. దానికి కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్‌మెంటే అందుకు నిద‌ర్శ‌నమని తెలిపింది.

చంద్ర‌బాబు స‌ర్కార్ కుట్ర‌ను స‌త్య‌వర్థన్ ఫిబ్ర‌వ‌రి 10, 2025 నాటు సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్‌మెంటే సాక్ష్యమని తెలిపింది. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో తాను అక్క‌డలేన‌న్న స‌త్య‌వ‌ర్థన్ స్టేట్ మెంట్లో చెప్పారు. టీడీపీ నాయ‌కుడు బ‌చ్చుల సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ కేసులో సాక్షిగా త‌న వ‌ద్ద సంత‌కం తీసుకున్నాడని సత్యవర్ధన్ తెలిపారు. ఇలా తాను కోర్టు ముందుకు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వడానికి త‌న‌ను ఎవ‌రూ బ‌ల‌వంతం పెట్ట‌లేద‌ని కూడా కోర్టులో సత్యవర్ధన్ వెల్లడించారని వైసీపీ తెలిపింది.

💣 Truth Bomb 💣

వంశీ అరెస్టు ల‌క్ష్యంగా చంద్రబాబు స‌ర్కార్ కుట్ర‌లు

- గ‌న్న‌వ‌రం కేసులో క‌ట్టుక‌థ‌లు, క‌ల్పితాలు, త‌ప్పుడు సాక్ష్యాలు, అక్ర‌మ అరెస్టులు

- కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్‌మెంటే అందుకు నిద‌ర్శ‌నం

- చంద్ర‌బాబు స‌ర్కార్ కుట్ర‌ను బయటపెట్టిన స‌త్య‌వర్థన్ ఫిబ్ర‌వ… pic.twitter.com/H5hseJpSv0

— YSR Congress Party (@YSRCParty) February 18, 2025