YSRCP support Amit Shah: దేశవ్యాప్తంా పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంలో రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయాలను చెబుతున్నాయి. సహజంగానే ఎన్డీఏ పార్టీలు ఎన్డీఏను సమర్థిస్తున్నాయి. ఇండీ కూటమి పార్టీలు అమిత్ షాపై ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏ కూటమిలో లేని వైసీపీ అనూహ్యంగా అమితా షాకు మద్దతుగా నిలిచింది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని సమర్థించిది. అమిత్ షా అంబేద్కర్ అగౌరవ పర్చలేదని తెలిపిది. వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

“వాళ్లు అంబేద్కర్‌ పేరును వందసార్లు అంటారు.. అన్నిసార్లు దేవుడ్ని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నట్టుగా’’ అమిత్‌ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయి. కాని, ఆ తర్వాత ఆయన అంబేద్కర్‌గారి గురించి కొనసాగిస్తూ ఆయన అన్న మాటలు, బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీగారు… pic.twitter.com/ln8KO1qwg2

— YSR Congress Party (@YSRCParty) December 19, 2024