YS Jagan Kurnool Tour: గురువారం కర్నూలులో పర్యటించిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి సమయంలో అధికారులు అవమానించారని ఆరోపించారు. దీన్ని అధికారులు ఖండించారు. ఎవరు ములాఖత్‌కు వచ్చినా పాటించే ప్రక్రియనే అమలు చేశామని తేల్చి చెప్పారు. అంతే కానీ అవమానకరంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు.

జైలులో ఉన్న RP నెంబర్ 1534 విరూపాక్షి, RP నెంబర్ 1564 శ్రీరాములు అనే రిమాండు ముద్దాయిలను కలవడానికి జగన్మోహన్ రెడ్డి సాయంత్రం కర్నూలు జిల్లా జైలు వచ్చారని తెలిపారు. జైలు ములాఖత్‌కు వచ్చే ప్రతి వ్యక్తి ఫోటో తీసుకోవడం జైలు నిబంధనల ప్రకారం తప్పనిసరి అని పేర్కొన్నారు. అది కూడా గేటు బయట, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో ఇంటర్వ్యూ గదికి పక్కగా ఉన్న రూంలో కిటికీ దగ్గర ఫోటో తీసుకుంటారు. తర్వాత ములాఖత్ మాట్లాడిస్తారు. ప్రతి సందర్శకుని ఫోటో తీసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఫోటో తీశారు.

రెండుసార్లు ఫొటోలు తీశారు

ఇద్దరు రిమాండ్ ముద్దాయులు విరూపాక్షి, శ్రీరాములను జగన్మోహన్ రెడ్డి కలుస్తారని రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఇద్దరికీ ములాఖత్ పెట్టడంతో e-prisons software ప్రకారం ఎంతమంది ఖైదీలకు ములాఖత్ పెట్టాలనుకుంటే అన్నిసార్లు ఫోటోలు తీయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రిమాండ్ ముద్దాయిలతో ములాఖత్ పెట్టడం వలన రెండుసార్లు ఫోటోలు తీసుకున్నారు. సందర్శకుడిగా జగన్మోహన్ ఫోటో తీసిన అనంతరం జైల్లోకి మూడు గంటల 50 నిమిషములకు ప్రవేశించి నాలుగు గంటల 20 నిమిషాల వరకు విరూపాక్షి,శ్రీరాములతో మాట్లాడారు. సమావేశం అనంతరం 4.20 నిమిషాలకు జైలు నుంచి బయటకు వెళ్లిపోయారు.

కించపరచలేదు

ములాఖత్ మాట్లాడే సమయంలో గానీ, గేటు బయట సందర్శకుడిగా ఫోటో దిగే సమయంలో గానీ ఆయనతో ఏ అధికారిగానీ, సిబ్బంది గానీ అమర్యాదగా ప్రవర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించే విధంగా జైలు సిబ్బంది గానీ అధికారులు కానీ ప్రవర్తించలేదు. అంతేకాకుండా ఈ ములాఖత్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి గానీ, జైలు శాఖ అధికారులు కానీ ఎవరి జోక్యం లేదని కర్నూలు జిల్లా జైలు పర్యవేక్షణాధికారి వేణుగోపాల్‌్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు.

జగన్ ఏం చెప్పారు?

వైసీపీ ఎమ్మెల్యే అయిన విరూపాక్షితో ములాఖత్ సమయంలో అధికారులు అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. గ్రిల్స్ నుంచి ఫొటోలు తీశారని చెప్పారు. ఎప్పుడూ ఇలా లేదు కదా అని అడిగితే పై నుంచి ఆదేశాలు ఉన్నందునే ఇలా చేయాల్సి వస్తుందని కూడా అక్కడ సిబ్బంది చెప్పారని కూడా జగన్ ఆరోపించారు. ఇది వైరల్ కావడంతో జిల్లా అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

🚨 #SadistChandraBabu

జైలులో ఉన్న మా ఎమ్మెల్యే విరూపాక్షి గారితో ములాఖత్ కోసం వెళ్లిన నన్ను అవమానించేలా గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటో తీశారు

సాధారణంగా కూర్చోబెట్టి ఫొటో తీసుకుని లోపలికి పంపిస్తారు. కానీ @ncbn శాడిజం మనస్తత్వంతో నన్ను అవమానించారు

అందరికీ ఇలానే తీస్తారా అని… pic.twitter.com/5I1d79F7nS

— YSR Congress Party (@YSRCParty) August 13, 2026