Seediri Appalaraju Son Bike Accident Case: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తోందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్‌జైలు వద్దకు చేరుకున్న ఆయన, టీడీపీ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక సాధారణ బైక్ యాక్సిడెంట్‌ను పక్కా పథకం ప్రకారం జరిగిన కుట్రగా, హత్యాయత్నంగా చిత్రీకరిస్తూ సీదిరి అప్పలరాజు కుమారుడిపై అక్రమ కేసులు బనాయించడం ఘోరమైన అన్యాయమని, ఇది కేవలం రాజకీయ వేధింపుల్లో భాగమేనని జగన్ తీవ్రంగా ఖండించారు.

సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఎవరికైనా జరగవచ్చని, అలాంటప్పుడు ఒక యాక్సిడెంట్‌కు కుట్ర రంగు పులమడం ఏ రకమైన న్యాయమని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు, వారి పిల్లలు లేదా బంధువులు యాక్సిడెంట్ చేస్తే.. కేసులు పెట్టి కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా అని జగన్ ప్రశఅనించారు. రోడ్డుపై గొర్రెలు కాస్తుండగా అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్ర ఉండదని, అసలు ఆ బాధితుడు ఎవరో కూడా అప్పలరాజు కొడుకుకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి అల్లిన కథనాలతో పోలీసులను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

అంపోలు జిల్లా జైలు వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు.#YSJaganInSrikakulam#SadistChandraBabu pic.twitter.com/uDuuONSBti

— YSR Congress Party (@YSRCParty) July 30, 2026

అంపోలు సబ్‌జైలు వద్ద వైఎస్ జగన్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ, ఈ పర్యటనలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. సబ్‌జైలులో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ అంతదూరం వచ్చినా సమయం అయిపోవడంతో జైలు అధికారులు పరామర్శకు అవకాశం ఇవ్వలేదు. మధ్యాహ్నమే రావాల్సి ఉన్నప్పటికీ రోడ్ షో చేసుకుంటూ రావడంతో జైలు వద్దకు వచ్చే సరికి సమయం ముగిసిపోయింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతూ మానసికంగా, భౌతికంగా వేధింపులకు గురిచేస్తోందని జగన్ ఆరోపించారు. స్థానిక సర్పంచ్ నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరిపైనా పోలీసుల ద్వారా అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఒకవైపు నిజమైన నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, మరోవైపు పగ సాధింపు రాజకీయాల కోసం వైఎస్సార్‌సీపీ నాయకుల కుటుంబాలను సైతం కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాల అక్రమ కేసులు బనాయించినా సీదిరి అప్పలరాజు కుటుంబానికి, బాధిత శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుందని జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. చట్టపరంగా, రాజకీయంగా ఈ వేధింపులను ఎదుర్కొంటామని, ప్రజాక్షేత్రంలోనే కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎండగడతామని హెచ్చరించారు. నాయకులను జైలులో కలవకుండా అడ్డుకున్నంత మాత్రాన తమ పోరాటాన్ని ఆపలేరని, ప్రజలే తగిన సమయంలో ఈ వేధింపులకు బుద్ధి చెబుతారని జగన్ ధీమా వ్యక్తం చేశారు.