Youtube Earnings for One Lakh Views : ఈరోజుల్లో యూట్యూబ్ అందరికీ చేరువలో ఉంది. సోషల్ మీడియా అంటే తెలియని పెద్దవారి నుంచి ఇన్ఫ్లూయెన్సర్స్ వరకు దీనిని ఉపయోగించేవారు ఉన్నారు. ఒకప్పటిలా యూట్యూబ్ కేవలం వినోదం కోసమే కాదు.. సంపాదించుకోవడానికి కూడా ఓ మంచి ప్లాట్‌ఫారమ్‌గా మారింది. అందుకే లక్షలాదిమంది ప్రతిరోజూ యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలతో డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అయితే యూట్యూబ్ ఛానెల్ లేనివారికి, యూట్యూబ్‌లోకి కొత్తగా వెళ్లాలనుకునేవారికి ఉండే ప్రధానమైన డౌట్ ఏంటంటే.. యూట్యూబ్‌లో డబ్బులు ఎలా వస్తుంది. అసలు లక్ష వ్యూలు వస్తే.. ఎంత డబ్బు వస్తుంది? అనే డౌట్ ఉంటుంది. మీకు అదే డౌట్ ఉంటే ఇది మీకోసమే.

యూట్యూబ్ నుంచి సంపాదన

యూట్యూబ్‌లో సంపాదించడానికి అతిపెద్దమార్గం ఆడియన్స్. అలాగే వీడియో షేర్స్. ఒకరు మీ వీడియో చూసి.. దానిలోని యాడ్స్ క్లిక్ చేయడం వల్ల లేదా వాటిని చూడడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. యూట్యూబ్ ఈ యాడ్స్ నుంచి సంపాదించిన డబ్బుల్లో కొంత మీకు ఇస్తుంది. సాధారణంగా యూట్యూబ్‌లో మీకు వచ్చిన యాడ్ రెవిన్యూలో 55% ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి ఇచ్చి.. 45% యూట్యూబ్ ఉంచుకుంటుంది.

RPM,i CPM అంటే ఏంటి?

మీరు యూట్యూబ్ ద్వారా వచ్చే సంపాదనను అర్థం చేసుకోవాలంటే మీకు రెండు పదాలు తెలియాలి. వాటిలో ఒకటి CPM (Cost Per Mille), రెండోది RPM (Revenue Per Mille). CPM అంటే యాడ్స్ క్రియేటర్స్ మీ వీడియో మీద ప్రతి 1000 వ్యూస్‌కి ఇచ్చే డబ్బు అనమాట. RPM అంటే 1000 వ్యూస్‌కి మీకు వస్తోన్న డబ్బులు. ఉదాహరణకి మీకు ఒక వీడియో ద్వారా CPM 200 రూపాయలు ఉంటే.. మీకు 100 నుంచి 120 రూపాయలు RPM రూపంలో వస్తాయి.

లక్ష వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది?

ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. లక్ష వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది అనే ప్రశ్నకు.. ఎప్పుడూ సమాధానం ఒకేలా ఉండదు. ఎందుకంటే ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. వీడియో టాపిక్ ఏమిటి? అంటే టెక్, హెల్త్, ఎడ్యూకేషన్ ఇలా ఏ టాపిక్ ఆ వీడియోలో ఉంది? వ్యూస్ ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి? ఇండియాలో CPM తక్కువ ఉంటుంది. కానీ అమెరికాలో ఎక్కువ ఉంటుంది. ఇలా పరిస్థితులను బట్టి రెవెన్యూ మారుతూ ఉంటుంది.

యాడ్స్ ఎంతమంది చూస్తారు?

ఇండియాలో హిందీలో లేదా ఏదైనా రీజనల్ లాంగ్వేజ్‌లో వీడియో ఉంటే.. దానికి లక్ష వ్యూస్ వస్తే.. 800 నుంచి 2000 రూపాయల వరకు సంపాదించవచ్చు. వీడియో ఇంగ్లీష్‌లో ఉంటూ.. అది ఫారిన్లో వాళ్లకి రీచ్ అయితే.. దాని నుంచి 5000 నుంచి 10,000 రూపాయల వరకు డబ్బులు రావొచ్చు.

సంపాదన కోసం స్మార్ట్ మార్గాలు

మీరు మీ యూట్యూబ్ ద్వారా సంపాదన పెంచుకోవాలనుకుంటే.. కేవలం వ్యూస్ మీద ఆధారపడకండి. వీడియో క్వాలిటీ, వాచ్ టైమ్ పెంచండి. టెక్నాలజీ, ఫైనాన్స్, చదువు వంటి అందరికీ నచ్చే, అవసరమైన టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. మీ ఛానల్లో స్పాన్సర్షిప్ వంటి లింక్స్ యాడ్ చేయండి. దీనివల్ల మీరు ఎక్కువగా సంపాదించుకోవచ్చు.