<p>Explosion in Peddakandukur in Yadadri district | యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మంది కార్మికులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది.</p>