Sophie Molineux Tops In WPL 2027 Auction: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ సోఫీ మొలినెక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యంత భారీ ధర పలికిన క్రీడాకారిణిగా నిలిచి వేలంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. అభిషేక్ నాయర్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఆమె కోసం స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తీవ్రంగా పోటీపడింది. భారీ పర్స్ బ్యాలెన్స్‌తో వేలంలోకి అడుగుపెట్టిన యూపీ వారియర్స్ చివరకు ఏకంగా 1.1 కోట్ల రూపాయలు వెచ్చించి మొలినెక్స్‌ను సొంతం చేసుకుంది. ఈ వేలంలో యూపీ మొత్తం ఎనిమిది మంది క్రీడాకారిణులను కొనుగోలు చేసింది. మరోవైపు ఇండియా బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు జెమీమా రోడ్రిగ్స్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ 75 లక్షల రూపాయలకు ఆమెను చేజిక్కించుకుని రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిపింది. ఇదే వేలంలో అత్యంత పిన్న వయస్కురాలైన 15 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ ఉమా కాశ్విని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేయడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తొలి రెండు గంటల పాటు ఒక్క బిడ్ కూడా వేయకుండా సంయమనం పాటించింది. ఆ తర్వాత స్టార్ విదేశీ ఆల్‌రౌండర్లు జెస్ జోనాసెన్, క్లోయ్ ట్రియాన్‌లను తమ ఖాతాలో వేసుకుంది.

THE AUCTION'S BIGGEST MOVES 📊 Which player are you most excited to watch in #TATAWPL 2027? 👇 #TATAWPLAuction https://t.co/N5IovdhzPF

— Women's Premier League (WPL) (@wplt20) October 28, 2026

టాప్ కొనుగోళ్లు ఇవే: జాబితాలో నిలిచిన స్టార్లు
ఈ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ ప్లేయర్ల వివరాలు పరిశీలిస్తే, సోఫీ మొలినెక్స్ 1.1 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, కిరణ్ నవ్‌గిరే 75 లక్షలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ జి. కమలినిని గుజరాత్ జెయింట్స్ 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేయగా, జెస్ జోనాసెన్‌ను ఆర్సీబీ 40 లక్షల రూపాయలకు సొంతం చేసుకుని సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. వీరితో పాటు గ్రేస్ హారిస్, స్నేహ రాణా, ఆశా శోభన, సుష్మా వర్మ, క్లోయ్ ట్రియాన్, తేజల్ హసబ్నిస్, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్‌లు తలో 30 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌కు అమ్ముడయ్యారు.

𝐓𝐡𝐞 𝐭𝐨𝐩 𝐛𝐮𝐲 𝐨𝐟 𝐭𝐡𝐞 #TATAWPLAuction 𝟐𝟎𝟐𝟕 👏 @UPWarriorz fans, how thrilled are you to welcome the Australian skipper to your side for the upcoming season? 💜 #TATAWPL https://t.co/41gWpkP9aR

— Women's Premier League (WPL) (@wplt20) October 28, 2026

ముంబై ఇండియన్స్ లో ప్రొఫైల్: గుజరాత్ విదేశీ వ్యూహం
రెండుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి వేలంలో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. భారీ ధరలకు వెళ్లకుండా మొత్తం ఆరుగురు భారత ఆటగాళ్లను కలిపి కేవలం 70 లక్షల రూపాయలకే దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ జట్టు భారత కీపర్ కమలినితో పాటు ఐర్లాండ్ స్టార్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్‌ను వారి బేస్ ప్రైజ్ వద్దే జట్టులోకి తీసుకుంది.

యాక్సిలరేటెడ్ రౌండ్ ఫలితాలు: ఆఖరి దశలో కొనుగోళ్ల హోరు
రెండో దశ యాక్సిలరేటెడ్ వేలంలో పలువురు ఆటగాళ్లు జట్లకు ఎంపికయ్యారు. క్లోయ్ ట్రియాన్ (30 లక్షలు), తేజల్ హసబ్నిస్ (30 లక్షలు), వృందా దినేష్ (10 లక్షలు)లను ఆర్సీబీ తీసుకుంది. ఆశా శోభనను యూపీ వారియర్స్ 30 లక్షలకు సొంతం చేసుకుంది. శ్వేతా సెహ్రావత్‌ను 20 లక్షలకు, అక్షిత భగత్‌ను 10 లక్షలకు ముంబై ఇండియన్స్ దక్కించుకోగా, నజ్మా ఖాన్‌ను 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.