<p><strong>WPL 2026 Final:</strong> మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ ముగింపు అద్భుతమైన మలుపులతో, ఉత్కంఠభరిత పోరాటంతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. వడోదర వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన వీరోచిత ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాత్రం మరోసారి ఫైనల్ గండం తప్పలేదు. </p>