World Toilet Day : ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుతారు. నేటికీ ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా ప్రజలు సురక్షితమైన, శుభ్రమైన మరుగుదొడ్డి సౌకర్యాన్ని కలిగి లేరని.. బహిరంగ మలవిసర్జన, మురికి నీరువల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. అందుకే ఈ మరుగుదొడ్డి ప్రాధన్యత, శుభ్రతను వివరిస్తూ ప్రతి ఏడాది వరల్డ్ టాయిలెట్ డేని నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవంలో భాగంగా.. 'అందరికీ పారిశుధ్యం, భద్రత, గౌరవం' అనే థీమ్తో ముందుకు వచ్చారు. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం 2025లో భాగంగా మరుగుదొడ్డి కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదని.. పిల్లల భద్రత, మహిళలకు మద్దతు, గౌరవాన్ని ఇస్తూ.. వ్యాధులను తగ్గించడమే లక్ష్యంగా దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. టాయిలెడ్ పరిశుభ్రత, అవసరాన్ని చాటి చెప్తూ.. ఓ దేశంలో టాయిలెట్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇలా టాయిలెట్ మ్యూజియం ఉన్న దేశం ప్రపంచంలో ఒకటే ఉంది. అది ఎక్కడుందో.. టాయిలెట్ డే గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

టాయిలెట్ మ్యూజియం

జపాన్ దేశంలో టాయిలెట్ మ్యూజియం (Toilet Museum in Japan) ఉంది. జపాన్ రాజధాని టోక్యోలోని ఈ మ్యూజియాన్ని పూప్ థీమ్‌తో రూపొందించారు. ఈ మ్యూజియంలో మిఠాయిలు, మార్ష్‌మల్లౌలు, కప్ కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు అన్నీ పూప్ లాగానే తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ టాయిలెట్ మ్యూజియం ప్రవేశ ద్వారం కూడా టాయిలెట్ సీటులాగే రూపొందించారు. దీనిని చూసి చాలామంది మొదట్లో ఆశ్చర్యపోయారు. ఈ టాయిలెట్ మ్యూజియం లోపలికి వెళ్లగానే ఫుడ్ షాప్ డెకరేషన్, లైట్ షోలు, ఫన్నీ గేమ్స్, టాయిలెట్ పేపర్ థీమ్‌పై సెటప్‌లు కనిపిస్తాయి.

టోక్యోలోని ఈ మ్యూజియం పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యతనిచ్చే జపాన్ సంస్కృతిని తెలియజేస్తుంది. ఈ మ్యూజియంకు వెళ్లేందుకు సందర్శకులు టికెట్ కొనాలి. దీని ప్రవేశ రుసుము టోక్యోలోని ఇతర మ్యూజియంల ప్రకారం నిర్ణయిస్తారు. జపాన్‌లో ఉన్న ఈ టాయిలెట్‌ మ్యూజియం చూడటానికి చాలా మంది విదేశీ యాత్రికులు ఇక్కడికి వస్తారు.

భారతదేశంలో కూడా టాయిలెట్ మ్యూజియం ఉందా?

జపాన్ మాదిరిగానే, భారతదేశంలో సులభ్ ఇంటర్నేషనల్ టాయిలెట్ మ్యూజియం కూడా ఉంది. ఇందులో 2500 BC నుంచి ఇప్పటి వరకు మరుగుదొడ్లు ఎలా అభివృద్ధి చెందాయనేది ప్రదర్శించారు. ఇది ఢిల్లీలో ఉంది. ఈ టాయిలెట్ మ్యూజియంను పురాతన, మధ్యయుగ, ఆధునిక మూడు భాగాలుగా విభజించారు. మీరు ఎప్పుడైనా ఇండియాలోని ఈ టాయిలెట్ మ్యూజియంకి వెళ్లారా?