ఆరోగ్య సమస్య ఉంటే ఆస్పత్రికి వెళ్తారు. దానిని ఫిజియో థెరపీ(World Physiotherapy)తో తగ్గించుకునే వెసులుబాటు ఉంటే వైద్యులు ఆ చికిత్సను సూచిస్తారు. కానీ చాలామంది మందులతో తగ్గించుకోవాలని.. ఫిజికల్ థెరపీ రోజూ చేయించుకోవాలా? ఇలాగే చెప్తారులే అని లైట్ తీసుకుంటారు. కానీ మీకు తెలుసా? ఫిజియో థెరపీ చేయించుకుంటే కొన్నిరకాల దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ విషయాన్నే ప్రపంచానికి చాటి చెప్పేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ థెరపీ డే(World Physical Therapy Day)ని నిర్వహిస్తున్నారు.

ఫిజియో థెరపీ డే చరిత్ర (Physical Therapy Day History)

ప్రతి ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ థెరపీ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1996 నుంచి ఇది (World Confederation for Physical Therapy) ప్రారంభమైంది. గ్లోబల్గా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫిజియోథెరపిస్టుల కృషిని గుర్తిస్తూ.. వారిని ప్రోత్సాహించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. అలాగే ఫిజియో థెరపీతో ఏయే ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చో వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు.

ఫిజియో థెరపీ ప్రాముఖ్యత (Physical Therapy Significance)

యాక్సిడెంట్స్ వల్ల జరిగే శారీరక గాయాలు, వైకల్యాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడంలో, చికిత్స చేయడంలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే హైలెట్ చేస్తుంది.

ఫిజికల్ థెరపీతో ఈ సమస్యలు దూరం (Physiotherapy to Reduce These Health Issues)

ఫిజియో థెరపీతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. క్రానిక్ పెయిన్స్తో ఇబ్బంది పడేవారికి ఇది ఓ వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే నడుము నొప్పి, మెడ నొప్పి, ఆర్థర్రైటిస్(Arthritis) వంటి సమస్యలను దూరం చేయడంలో ఫిజియో మంచి ఫలితాలు ఇస్తుంది. హీట్ థెరపీ, ఆల్ట్రాసౌండ్, మ్యానువల్ థెరపీ నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఫిజియోలో భాగంగా చేసే స్ట్రెచింగ్ వ్యాయామాలు బలాన్ని పెంచి జాయింట్ హెల్త్ని మెరుగుపరుస్తాయి.

సర్జరీ రికవరీకై..(Post-Surgery Recovery)

మోకాళ్ల రిప్లేస్మెంట్, హార్ట్ సర్జరీ, ఫ్యాక్చర్ అయినప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల మళ్లీ తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఈ సమయంలో ఫిజియో చేయడం వల్ల సర్జరీ చేయించిన ప్రాంతాలకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. దీనివల్ల పట్టేయడం జరగకుండా గాయం నుంచి త్వరగా కోలుకోగలుగుతారు.

మరెన్నో లాభాలు

కాళ్లు వాపు, లిగ్మెంట్ టియర్స్, కండరాలకు తగిలే గాయాలను దూరం చేసేందుకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. స్ప్రోర్ట్స్ గాయాలకు ఇది బెస్ట్ రికవరీ ఆప్షన్గా చెప్తారు. భంగిమ సరిచేయడం, స్ట్రోక్, పార్కిన్సన్, పక్షవాతం వంటి న్యూరోలాజికల్ సమస్యలకు ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎవరి సహాయం లేకుండా రోగులు తమ పనులు తాము చేసుకోవడానికి ఫిజియో థెరపీ హెల్ప్ అవుతుంది.

ఆస్తమా వంటి సమస్యలు దూరం చేసుకోవడానికి బ్రీతింగ్ వ్యాయామాలు, ఒబెసిటీ, బరువు అదుపులో ఉంచుకోవడం, మధుమేహాన్ని తగ్గించుకోవడం, బీపీని దూరం చేసుకోవడం ఇలా మొత్తం ఫిట్నెస్కు ఫిజియో హెల్ప్ అవుతుంది. అందుకే ఫిజికల్ థెరపీ గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన ఇస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా సందర్భంలో వైద్యులు ఫిజియో థెరపీని సూచిస్తే అస్సలు విస్మరించకండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.