Women Savings Schemes in India 2025: భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఓవైపు మహిళా సాధికారత వైపు అడుగులు పడుతున్నా, మరోవైపు వారిపై ఖర్చులపై కుటుంబాలు ఇంకా వెనుకాడుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే భారత మహిళలు ఇప్పుడు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. నేడు మహిళలు అటు ఇంటిని, ఇటు ఆఫీసు పనులను చూసుకుంటున్నారు. వారి బాధ్యతలు మరింత పెరిగాయి. అయితే, ఆడపిల్లలు కూడా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

తమ ఖర్చులను భరించడం నుండి, ఇప్పుడు ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు అడుగులు వేస్తున్నారు. భారత ప్రభుత్వం, బ్యాంకులు మహిళలను దృష్టిలో ఉంచుకుని అనేక పొదుపు పథకాలు (Savings Schemes)ను ప్రారంభించాయి. దీనిలో వారి మీద చేస్తున్న పొదుపుపై మంచి రాబడి లభిస్తుంది. మీ కోసం లేదా మీ కుటుంబంలోని మహిళల కోసం మంచి పొదుపు పథకం కోసం చూస్తున్నారా.. అయితే ఈ పథకాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

పోస్ట్ ఆఫీస్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్

పోస్ట్ ఆఫీస్ (Post Office) మహిళా సమ్మాన్ పొదుపు పథకం 2023 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఇది స్వల్పకాలిక పథకం. దీని కాల వ్యవధి 2 సంవత్సరాలు. ఈ పథకం కింద సాధారణ పొదుపు ఖాతాలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. కొంత కాలానికి సురక్షితమైన, మంచి రాబడినిచ్చే పథకం కోసం చూస్తున్న మహిళలకు ఇది సరైన స్కీమ్.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన అనేది బాలికల విద్య, వారి భవిష్యత్తును సురక్షితం చేయడానికి తీసుకొచ్చిన పథకం. ఇందులో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల తల్లిదండ్రులు తమ కుమార్తె పేరుతో అకౌంట్ తెరవవచ్చు. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. ఈ పథకం కింద పొదుపుపై సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ వస్తుంది. ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఇది ఎక్కువ. ఈ పథకంలో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు (Tax Benefits) లభిస్తుంది.

నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC)

నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (National Saving Certificate), ఎన్‌ఎస్‌సీ అని కూడా పిలుస్తారు. ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన సేవింగ్స్ స్కీమ్. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. NSC మెచ్యూరిటీ కాల వ్యవధి 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పొదుపుపై 7.7 శాతం వడ్డీ పొందుతారు. మీకు సెక్షన్ 80C ప్రకారం పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది.

మీరు దీర్ఘకాలికంగా సురక్షితమైన పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఈ పథకం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడిదారులు ఇందులో రూ. 1000 కనీస మొత్తంతో తమ పొదుపు ప్రారంభించవచ్చు.

నిరాకరణ: (ఇక్కడ అందించిన సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించాం. మార్కెట్‌లో పెట్టుబడి మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటుందని గుర్తించడం ముఖ్యం. పెట్టుబడిదారుడిగా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుడిని సంప్రదించాలి. ABP Desam ఎవరికీ డబ్బు పెట్టుబడి పెట్టాలని ఎప్పుడూ సలహా ఇవ్వదు.)