Harish Rao target BRS party: భారత రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు చేసినందున కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో కవిత మరింతగా హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేశారు. ఇప్పటి వరకూ కవిత అంశంపై కేసీఆర్ లేదా కేటీఆర్ స్పందించలేదు. కవిత కూడా వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా హరీష్ రావు.. కేసీఆర్, కేటీఆర్ పై కుట్ర చేయవచ్చని అంటున్నారు. అంటే..కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే..కానీ ఆ ఫ్యామిలీలో హరీష్ రావు , సంతోష్ రావు లేరు.

హరీష్ రావుపై ఇక నుంచి పార్టీలో అనుమానాలు ఖాయం!

హరీష్ రావు బీఆఎస్ పార్టీలో కీలకం. కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన వెంటనే ఉన్నారు. సహజంగానే ఆయనకు పార్టీపై పట్టు ఉంటుంది. నిజానికి హరీష్ రావుపై ఇప్పటి వరకూ నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు లేవు. ఇతర పార్టీల నేతలు కూడా ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు. ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని ఎవరూ ఆరోపణలు చేయలేదు. గత రెండు, మూడేళ్లలో ఆయన భార్య ఓ పాలడైరీని ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు.అంతకు మించి హరీష్ బిజినెస్‌లపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు లక్ష కోట్ల కాళేశ్వరం అవినీతికే హరీష్ దే కీలక పాత్ర అని కవిత ఉంటున్నారు.

హఠాత్తుగా కేటీఆర్ పై సాఫ్ట్ కార్నర్

కవిత హఠాత్తుగా కేటీఆర్‌పై సాఫ్ట్ కార్నర్ చూపించారు. నిన్నామొన్నటి వరకూ కేటీఆర్ పై కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పార్టీ నడపడం చేత కాదన్నారు. కానీ ఇవాళ రామన్న..రామన్న అభిమానం చూఫారు .మాట్లాడి 103 రోజులు అయిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లతో తనది రక్త సంబంధమని రాజకీయాలతో సంబందం లేనిదన్నారు. కేసీఆర్, కవిత కూడా ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అందుకే .. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని చెబుతున్నారు.

సంతోష్ రావు అవినీతిపై బయట పెట్టాలనుకున్నారా ?

సంతోష్ రావు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉంది. ఆయనపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కొంత కాలం.. ప్రగతి భవన్ కు ఆయన వెళ్లలేదని చెబుతున్నారు. ఇప్పుడు కవిత చాలా పెద్ద ఆరోపణలు చేశారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపడుతున్నారని అంటున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భారీ అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. ఈ వ్యవహారం కూడా సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హరీష్ రావును కేసీఆర్ ఒక్కో సారి దూరం పెడుతూంటారు. రెండో సారి గెలిచిన తర్వాత చాలా కాలం మంత్రి పదవి ఇవ్వలేదు. పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ఈటలను పార్టీ నుంచి పంపేసిన తర్వాతనే ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. కారణం ఏదైనా హరీష్ రావు ఇప్పటి వరకూ పార్టీకి కానీ..కేసీఆర్, కేటీఆర్ కు కానీ వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హరీష్ పై పెరుగుతున్న విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.