Weirdest Divorce Reasons in the World : వివాహం జీవితం అత్యంత అందమైన సంబంధంగా చెప్తారు కానీ.. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడాకుల కేసులు పెరిగాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. వింతైన కారణాలు చెప్పి విడాకులు తీసుకోవడం. వాటి గురించి తెలిస్తే ఛీ.. ఇవి కూడా ఓ కారణమేనా అనిపిస్తాది. మరి అలాంటి 5 వింతైన విడాకుల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సెలబ్రెటీల నుంచి కామన్మ్యాన్ వరకు విడాకుల కేసులు తరచుగానే వింటూ ఉన్నాము. అయితే కొందరికి సీరియస్ రీజన్స్ ఉంటే.. కొందరికీ మాత్రం వింత రీజన్స్ ఉంటున్నాయి. వాళ్ల కారణాలు నమ్మడం కూడా కష్టంగానే ఉంటుంది. చిన్న విషయం కూడా విడాకులకు దారితీస్తుంది. మరికొన్నిసార్లు కారణాలు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వాటిలో కొన్ని...

జుట్టు రాలుతుందని..

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని సాంగ్ క్యూ నగరానికి చెందిన లి అనే మహిళ తన భర్త 16 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు తీసుకున్నాడని నివేదించింది. అనారోగ్యం కారణంగా జుట్టు రాలడమే విడాకులకు కారణమని తెలిపింది. ఆ మహిళ విటిలిగోతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె జుట్టు వేగంగా రాలిపోయి తెల్లటి మచ్చలు కనిపించాయి. కాలక్రమేణా.. ఆమె రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. నివేదికల ప్రకారం ఆమె భర్త చికిత్స సమయంలో ఆమెకు మద్దతు ఇవ్వడం మానేసి విడాకులు తీసుకున్నాడట.

స్ట్రాబెర్రీ తిన్నాడని..

ఒక మహిళ తన భర్త ఒక మొక్క మీద పెరిగిన స్ట్రాబెర్రీని తిన్నాడని విడాకులు తీసుకుంది. అలాగే అతనిలో సరిదిద్దలేని తప్పులు ఉన్నాయని.. ఆ తేడాలను గుర్తించి విడాకులు కావాలని కోరింది. ఈ కేసు వినడానికి వింతగానే ఉంటుంది.

మ్యాగీనే చేస్తుంది సార్..

కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన విడాకుల కేసు కూడా విస్తృతంగా చర్చనీయాంశమైంది. తన భార్య ప్రతిరోజూ మ్యాగీ మాత్రమే వండుతుందని ఒక వ్యక్తి ఆమె నుంచి విడాకులు కావాలని కోర్టు ఆశ్రయించాడు. తన భార్యకు సరిగ్గా వంట చేయడం తెలియదని, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనానికి మ్యాగీ మాత్రమే వడ్డించిందని భర్త ఆరోపించాడు. దీని ఫలితంగా ఇద్దరి మధ్య వాదనలు పెరిగాయి. చివరికి వారు విడాకులు తీసుకున్నారు.

గొడవ పడట్లేదు.. ప్రేమిస్తున్నాడు

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాకు చెందిన కేసులో ఒక మహిళ వివాహం అయిన 18 నెలలకే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన భర్త తనను గాఢంగా ప్రేమించాడని.. తనతో ఎప్పుడూ గొడవ పడలేదని ఆమె పేర్కొంది. అతను ఎప్పుడూ గొంతు ఎత్తలేదని, కోపంగా లేడని.. దీనివల్ల తనకు ఊపిరాడకపోయేదని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే షరియా కోర్టు ఆమె విడాకుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కారణం అబద్ధమని పేర్కొంది.

అత్తగారి హనీమూన్

ఇటలీకి చెందిన 36 ఏళ్ల బ్యూటీషియన్ మరియానా.. వారి వివాహం జరిగిన ఒక నెల తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చింది. విడాకులకు కారణం ఆమె అత్తగారి హనీమూన్. నివేదికల ప్రకారం.. మరియానా భర్తతో వెళ్లిన ప్లేస్కి తన అత్త కూడా హనీమూన్కి వెళ్లిందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుందట. ఆ జంట హనీమూన్ వెళ్ళిన హోటల్‌లోనే గది బుక్ చేసుకున్నారని కారణం కోర్టులో చెప్పిందట.