NTR Hrithik Roshan Power Packed Dance With 500 Dancers In War 2 Movie: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న అవెయిటెడ్ మూవీ 'వార్ 2' (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మూవీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దించినట్లు సమాచారం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ సరికొత్త గీతాన్ని ఎన్టీఆర్, హృతిక్ కోసం రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

యష్‌రాజ్ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాటను బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ క్రేజీ న్యూస్ నిజమైతే 500 మంది డ్యాన్సర్ల మధ్య ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్‌తో థియేటర్లు దద్దరిల్లుతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Also Read: నితిన్ 'రాబిన్ హుడ్‌'లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ - ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?