Waqf Amendment Act Latest News | న్యూఢిల్లీ:వక్ఫ్ సవరణ చట్టం 2025 లోని కొన్ని నిబంధనలపై, కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆస్తులు వక్ఫ్ చేయడానికి ఐదు సంవత్సరాల పాటు ఓ వ్యక్తి ఇస్లాంను అనుసరించాలనే నిబంధనను నిలిపివేసింది. ఎవరైనా ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నారని నిర్ణయించేలా నిబంధనలు రూపొందించేవరకు ఇది అమల్లో ఉండదని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యుల సంఖ్యను సైతం సర్వోన్నత న్యాయస్థానం పరిమితం చేసింది. మొత్తం వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

వక్ఫ్ చట్టాన్ని నిలిపివేసేందుకు ఏ కారణాలు లేవు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి (BR Gavai), జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసిహ్ లతో కూడిన ధర్మాసనం వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లపై ఎక్కువ వివాదం నడుస్తోందని పేర్కొంది. పాత చట్టాలను కూడా పరిశీలించాము. మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి ఎటువంటి ఆధారాలు, పరిస్థితులు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల్ని తగ్గించాలి

సోమవారం (సెప్టెంబర్ 15, 2025) నాడు సుప్రీం ధర్మాసనం.. కలెక్టర్ వక్ఫ్ భూ వివాదాలను పరిష్కరించలేరు, అలాంటి కేసులను ట్రిబ్యునళ్లకు పంపించాలి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల సంఖ్య పరిమితం చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర, కేంద్ర బోర్డులలో ముస్లిమేతరులు ముగ్గురు కంటే ఎక్కువ ఉండరాదని ధర్మాసనం సూచించింది. ప్రతి సెక్షన్ కోసం మేము తొలిసారే సవాలును పరిశీలించాము. మొత్తం వక్ఫ్ సవరణ చట్టాన్ని నిలిపివేయడానికి ఎలాంటి బలమైన కారణం లేదని గుర్తించినట్లు ధర్మాసనం పేర్కొంది.

వక్ఫ్ సవరణ చట్టంపై స్టేను అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే విధించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వక్ఫ్ ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు ఇస్లాంను అనుసరించడం తప్పనిసరి అని పేర్కొన్న వక్ఫ్ సవరణ చట్టం, 2025 లోని నిబంధనను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నాడా లేదా అనేది నిర్ణయించడానికి నిబంధనలు చేసే వరకు ఈ నిబంధన నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 లోని అన్ని నిబంధనలను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, కొన్ని సెక్షన్లకు కొంత రక్షణ అవసరమని ధర్మాసనం పేర్కొంది.