<p>17 thousand crores as a package for the maintenance of Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉండదని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నిర్వహణ నిధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ. 17వేల కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారి ప్రకటనను శుక్రవారం జారీచేసే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> కీలకంగా మారడం... ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించి తర్వాత.. ఆ సంస్థను పూర్తి స్థాయిలో గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. </p>